What happend To Virat Kohli in T20 World Cup 2024: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి.. జట్టుకు అద్భుత ఆరంభాలు అందించాడు. 15 మ్యాచ్‌లలో 741 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ఫామ్‌తో టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ మాదిరే మెగా టోర్నీలో మెరుపులు మెరిస్తాడనుకుంటే.. వరుస వైఫల్యాలతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు.
1, 4, 0.. ఇవీ టీ20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీ చేసిన పరుగులు. ఐర్లాండ్‌పై 1 పరుగు చేసిన విరాట్.. కీలక పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చెలరేగుతాడునుకుంటే.. ఆ మ్యాచ్‌లోనూ తేలిపోయాడు. ఇక పసికూన అమెరికాపై అయినా ఫామ్ అందుకుంటాడనుకుంటే.. అది జరగలేదు. ఏకంగా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. న్యూయార్క్ పిచ్ బ్యాటింగ్ చాలా కష్టంగా ఉన్నా.. మేటి బ్యాటర్ అయిన విరాట్ మరీ చెత్త ప్రదర్శన చేయడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. దాంతో ఐపీఎల్‌లో రెచ్చిపోయిన కోహ్లీకి ఏమైంది? అని ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. కెనడాతో మ్యాచ్‌లో అయినా విరాట్ ఫామ్ అందుకోవాలని ఫాన్స్ సహా టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
టీ20 ప్రపంచకప్ 2024లో ఆడిన మూడు మ్యాచ్‌లలో భారత్ విజయాలు సాధించింది. 6 పాయింట్లతో ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించింది. సూపర్ 8లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా లాంటి టాప్ జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్‌లేమి టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. కెనడాతో మ్యాచ్‌తో ఫామ్ అందుకుంటే.. ఆత్మవిశ్వాసంతో సూపర్ 8లో ఆడొచ్చు.