NTV Telugu Site icon

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 కు అర్హత సాధించిన ఆ 12 జట్లు..

2026 World Cup

2026 World Cup

T20 World Cup 2026: ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్లో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 తరువాత జరగబోయే 2026 ఎడిషన్ కి ఎంతో కీలకం. దీనికి భారతదేశం, శ్రీలంక సహ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ వరల్డ్ కప్ లో మొదటి రౌండ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంకలు నిష్క్రమించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ చివరి నిమిషంలో సూపర్ 8 దశకు చేరుకుంది. 2024 టి 20 ప్రపంచ కప్ సూపర్ 8 దశ తదుపరి రౌండ్ మాత్రమే కాదు. 8 క్వాలిఫైయింగ్ జట్లు కూడా 2026 టి20 ప్రపంచ కప్ కు నేరుగా అర్హత సాధిస్తాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకారం 2026 ఎడిషన్లో 12 జట్లు చోటు దక్కించుకున్నాయి.

భారతదేశం, శ్రీలంక 2026 టి20 ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు వెస్టిండీస్ కూడా ప్రస్తుత టి 20 ప్రపంచ కప్ లో సూపర్ 8 దశకు చేరుకోవడం ద్వారా 2026 టోర్నమెంట్లో తమ స్థానాలను దక్కించుకున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్, ఐర్లాండ్ 2024 టి 20 ప్రపంచ కప్లో సూపర్ 8 కి చేరుకోకపోవచ్చు కాని., వారు ఇప్పటికే రెండేళ్ల వ్యవధిలో ప్రపంచ కప్ కు అర్హత సాధించారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్థాన్ తో పాటు ఈ నాలుగు జట్లు రాబోయే ప్రపంచ కప్ కు అర్హత సాధించాయి. న్యూజిలాండ్ ప్రస్తుతం ఆరవ స్థానంలో, పాకిస్తాన్ ఏడవ స్థానంలో, ఐర్లాండ్ పదకొండవ స్థానంలో ఉన్నాయి.

ఇక మిగిలిన 8 జట్లు ఎలా అర్హత సాధిస్తాయి..?

* యూరోపియన్ క్వాలిఫైయర్ నుండి రెండు జట్లు ఎంపిక అవుతాయి.
* తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్ మరియు అమెరికాస్ క్వాలిఫైయర్ నుండి ఒక్కొక్క జట్టు ఎంపిక అవుతాయి.
* ఆసియా క్వాలిఫైయర్ మరియు ఆఫ్రికా క్వాలిఫైయర్ నుండి రెండు జట్లు ఎంపిక అవుతాయి.

అర్హత ప్రక్రియ ఏంటంటే..

ఆటోమేటిక్ క్వాలిఫైయర్స్: 12 జట్లు
ప్రాంతీయ అర్హతలు: 8 జట్లు (యూరప్: 2; ఈస్ట్ ఆసియ పసిఫిక్, అమెరికన్: 1; ఆసియా, ఆఫ్రికా: 2 ఈచ్)