Site icon NTV Telugu

స్టాండ్‌బై ప్లేయర్స్ లేకుండానే T20 World Cupకు టీమిండియా.. ఎందుకంటే..?

Barath

Barath

No Standby Players: టీ20 వరల్డ్ కప్‌ 2026కకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఈరోజు బీసీసీఐ (డిసెంబర్ 20) ప్రకటించింది. ఈ జట్టు ఎంపికలో పలు కీలక నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌తో పాటు వికెట్‌ కీపర్ జితేశ్ శర్మను జట్టు నుంచి తప్పించింది. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన రింకూ సింగ్ ను మళ్లీ టీంలోకి రాగా, గాయంతో గత రెండు టీ20 మ్యాచ్‌లకు దూరమైన అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చి సూర్యకుమార్ కు డిప్యూటీగా బాధ్యతలు అందుకున్నాడు.

Read Also: China Mega Dam: భారత్ – చైనా మధ్య వాటర్‌ బాంబ్.. డేంజర్‌ జోన్‌లో ఇండియా!

అయితే, ఈసారి టీమిండియా సెలెక్టర్లు ఎవరినీ స్టాండ్‌బై ఆటగాళ్లను ప్రకటించకపోవడం విశేషం. సాధారణంగా ఐసీసీ టోర్నమెంట్‌లకు స్టాండ్‌బై ప్లేయర్లను ప్రకటించడం తప్పనిసరి అయినప్పటికీ, ఈసారి అలాంటి జాబితా మాత్రం భారత జట్టులో కనిపించలేదు.. దీనిపై స్పందించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. టోర్నమెంట్ మొత్తం మన దేశంలోనే జరుగుతోంది.. అవసరమైతే ఎప్పుడైనా ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.. అందుకే స్టాండ్‌బై ప్లేయర్స్ అవసరం లేదని నిర్ణయించామని పేర్కొన్నారు.

Read Also: Hydra: నిజాం కాలం నాటి ‘బమ్రుక్నా ఉద్దౌలా’ చెరువుకు అభివృద్ధి పనులు వేగవంతం!

ఇక, ఈ వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. లీగ్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం మాత్రమే భారత్ శ్రీలంకకు ప్రయాణించనుంది. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనున్న టీమిండియా ఫిబ్రవరి 7న ముంబై వాంఖడే స్టేడియంలో యూఎస్ఏతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 12న నమీబియాతో రెండో మ్యాచ్, ఫిబ్రవరి 15న కొలంబో ఆర్.ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 18వ తేదీన నెదర్లాండ్స్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. సెమీ ఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో జరగగా, మార్చి 8న ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగియనుంది.

Exit mobile version