NTV Telugu Site icon

T20 World Cup 2024 Winner: టీ20 ప్రపంచకప్‌ విజేత ఆ జట్టే: అక్తర్

Shoaib Akhtar

Shoaib Akhtar

Shoaib Akhtar Predicts T20 World Cup 2024 Winner: టీ20 ప్రపంచకప్‌ 2024 సెమీఫైనల్స్‌కు సమయం ఆసన్నమైంది. జూన్ 27న జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ జట్లు తలపడనుండగా.. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను భారత్‌ ఢీకొనబోతోంది. వన్డే ప్రపంచకప్‌ 2023ని తృటిలో కోల్పోయిన భారత్.. పొట్టి కప్ లక్ష్యంగా సెమీస్‌లో బరిలోకి దిగుతోంది. టైటిల్ ఫెవరేట్‌లలో టీమిండియా కూడా ఒకటి. రోహిత్ సేన పొట్టి కప్ గెలవాలని భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. భారత్ టైటిల్ గెలవాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా కోరుకుంటున్నాడు.

వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్‌ 2024 సూపర్-8 స్టేజ్‌లోనే ఆస్ట్రేలియాను భారత్ ఇంటికి పంపింది. పొట్టి కప్ అందుకునేందుకు ఇంకో రెండడుగుల దూరంలో ఉంది. ప్రపంచకప్‌ 2023 ఫైనల్ ఓటమికి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న భారత జట్టును షోయబ్ అక్తర్ కొనియాడాడు. ‘ఆస్ట్రేలియాపై భారత్‌ అద్భుత విజయం సాధించింది. గెలవాల్సిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ ఓటమి అనంతరం భారత్ తీవ్ర నిరాశకు లోనైంది. ఆ నిరాశ ప్రతీకారంగా మారింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాను చిత్తుచేసేలా చేసింది’ అని అక్తర్ అన్నాడు.

Also Read: IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్‌తో ఆడే భారత్ తుది జట్టు ఇదే

‘ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ చేయాల్సిందంతా చేశాడు. స్టార్క్‌ను ఎదుర్కొన్న తీరు సూపర్. మంచి ఇంటెంట్‌తో ఆడాడు. 150 పరుగులు చేస్తాడనుకున్నా. రోహిత్ ఆలోచనలకు ఓ స్ఫష్టత ఉంది. అతను ట్రోఫీని అందుకోవడానికి అర్హుడు. భారత్ ఈ ప్రపంచకప్‌ను తప్పక గెలవాలి. ట్రోఫీ ఉపఖండంలోనే ఉండాలి. గత వన్డే ప్రపంచకప్‌ను సాధించడానికి మీరు వంద శాతం అర్హులు. భారత్‌కే నా మద్దతు’ అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.

Show comments