NTV Telugu Site icon

Saurabh Netravalkar: అతడి వికెట్‌ తీయడం ఓ ఎమోషనల్‌ మూమెంట్‌: అమెరికా పేసర్‌

Saurabh Netravalkar Kohli

Saurabh Netravalkar Kohli

Saurabh Netravalkar Said Virat Kohli wicket is very special for me: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ఓ ఎమోషనల్ మూమెంట్ అని అమెరికా లెఫ్టార్మ్ సీమర్ సౌరభ్‌ నేత్రావల్కర్‌ వెల్లడించాడు. విరాట్‌తో తనకు అంతగా పరిచయం లేదని.. వికెట్‌ తీసిన అనంతరం అభినందించాడని తెలిపాడు. 32 ఏళ్ల నేత్రావల్కర్‌ 2010లో భారత్‌ తరఫున అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి.. ఒరాకిల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు తనకిష్టమైన క్రికెట్ ఆడాడు. ఆనతి కాలంలోనే అమెరికా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆడుతున్నాడు.

గ్రూప్‌-ఏలో భాగంగా కెనడా, పాకిస్తాన్‌లపై అమెరికా విజయం సాధించడంలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీని గోల్డెన్‌ డకౌట్‌గా అవుట్ చేసిన నేత్రావల్కర్‌.. రోహిత్‌ శర్మ వికెట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌ అనంతరం నేత్రావల్కర్‌ మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘నేను రెండు రంగాల్లో కెరీర్‌ కొనసాగిస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇదంతా త్వరత్వరగా జరిగిపోయింది. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా’ అని నేత్రావల్కర్‌ తెలిపాడు.

Also Read: Sehwag-Shakib: సెహ్వాగ్‌ ఎవరో నాకు తెలియదు.. షకీబ్‌ అల్ హసన్ కౌంటర్‌!

‘నాకు పాకిస్తాన్, భారత్‌ మ్యాచ్‌లు అత్యంత కీలకమైనవి. విరాట్‌ కోహ్లీ వికెట్‌ తీయడం ఓ ఎమోషనల్‌ మూమెంట్‌. ఆఫ్‌ స్టంప్ ఎగురగొట్టాలని చూశా. నా ప్రణాళికను పక్కాగా అమలు చేసి విరాట్ వికెట్‌ తీశా. విరాట్‌తో నాకు అంతగా పరిచయం లేదు. కానీ వికెట్‌ తీసిన తర్వాత నన్ను అభినందించాడు’ అని సౌరభ్‌ నేత్రావల్కర్‌ చెప్పాడు. భారత్‌, అమెరికా మ్యాచ్‌ అనంతరం నేత్రావల్కర్‌ ఇంటర్వ్యూ కోసం విలేకరులు ఆసక్తి చూపించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్ష్‌దీప్‌ సింగ్‌ను వదిలి పది మందికి పైగా రిపోర్టర్లు నేత్రవాల్కర్‌ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించారు.