NTV Telugu Site icon

T20 World Cup 2024: ప్రపంచకప్‌ చూడాలని లేదు.. రియాన్‌ పరాగ్‌ సంచలన వ్యాఖ్యలు!

Riyan Parag

Riyan Parag

Riyan Parag on T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు స్థానం దక్కపోవడంపై రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈసారి ప్రపంచకప్‌ చూడాలనే ఆసక్తి తనకు లేదని పరాగ్‌ తెలిపాడు. ఒకవేళ భారత జట్టులో ఉంటే.. టాప్‌-4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడిని అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న రియాన్‌.. ప్రపంచకప్‌ కోసం తీసుకుంటారనే చర్చ వచ్చింది. కానీ బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడికి షాక్ ఇచ్చారు.

టీ20 ప్రపంచకప్‌ 2024లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాపై అద్భుత విజయం సాధించిన భారత్‌ జోష్‌ మీదుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో రియాన్‌ పరాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను వటీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండుంటే ఏమమవుతుందనే కంగారు ఉండేది. ఇప్పుడీ నేను టీమ్‌లో లేను. కాబట్టి నాకు పెద్దగా ఆసక్తి లేదు. టాప్‌-4లో ఎవరు ఉంటారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పుడే సమాధానం చెబితే కొన్ని జట్లపై పక్షపాతం చూపించినట్లవుతుంది’ అని రియాన్‌ అన్నాడు.

Also Read: Super Over: టీ20 ప్రపంచకప్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్‌ ఓవర్‌లో నమీబియా విజయం!

‘నిజాయతీగా చెప్పాలంటే అసలు ఈసారి ప్రపంచకప్‌ను చూడాలని నాకు లేదు. మ్యాచ్ చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. నేను ఒకవేళ జట్టులో ఉంటే అప్పుడేమైనా టాప్‌ -4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడినేమో. ఇక మైదానంలో విరాట్‌ కోహ్లీ చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరు. అతడు అత్యుత్తమ బ్యాటర్’ అని రియాన్‌ పరాగ్‌ పేర్కొన్నాడు. గతేడాది ఐపీఎల్‌లో పెద్దగా రాణించని రియాన్‌.. తన ప్రవర్తనతో మాత్రం నిత్యం వార్తల్లో నిలిచాడు. ఈసారి మాత్రం అద్భుత ఆటతీరును ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాడు. ఐపీఎల్ 2024లో రాజస్థాన్‌ రాయల్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 573 పరుగులు చేశాడు.