Rinku Singh: పాడె మోస్తూ, తండ్రికి రింకూసింగ్ భావోద్వేగ వీడ్కోలు..

  • తుదిశ్వాస విడిచిన రింకూ సింగ్ తండ్రి..
  • పాడె మోస్తూ భావోద్వేగ వీడ్కోలు..
Rinku Singh

Rinku Singh

Rinku Singh: భారత బ్యాటర్ రింకూసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. టీ20 ప్రపంచ కప్ సమయంలో రింకూ‌కు తండ్రి మరణం రూపంలో షాక్ తగిలింది. చెన్నైలో జరిగిన జింబాబ్వే మ్యాచ్‌కు ముందే రింకూ తండ్రికి సీరియస్‌గా ఉన్నట్లు తెలియడంతో అతను నోయిడా వెళ్లి వచ్చారు. శుక్రవారం గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆస్పత్రిలో ఖచంద్ సింగ్ మరణించారు. నాలుగో దశ కాలేయ క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించడం రింకూ కుటుంబానికి తీరని లోటు మిగిల్చింది.

Read Also: Pakistan Israel War: అప్పుడు భారత్, ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్.. పాక్‌లో చైనా వ్యవస్థలు విఫలం..!

జింబాబ్వే మ్యాచ్ ముగిసిన తర్వాత రోజే రింకూ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో, రింకు తన తండ్రి మృతదేహాన్ని మోస్తున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు, చుట్టూ పోలీసు సిబ్బంది, నివాళులు అర్పించడానికి గుమిగూడిన వందలాది మంది అభిమానులు ఉన్నారు.

జింబాబ్వే మ్యాచ్‌లో రింకూ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేదు. అభిషేక్ శర్మతో పాటు సంజు సామ్సన్ ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేయడంతో, జట్టు కూర్పు నుంచి రింకూ తప్పుకున్నాడు. ఈ టోర్నీలో రింకూ పెద్దగా బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోయాడు. అతను ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు, రెండుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. అత్యధిక స్కోర్ 11 పరుగులు. ఆదివారం వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా చివరి సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది.