NTV Telugu Site icon

Team India-PM Modi: ప్రధాని మోడీతో భారత క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్!

Team India Pm Modi

Team India Pm Modi

Team India Players Photo With PM Modi: టీ20 ప్రపంచకప్‌ 2024తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లు.. గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీతో ప్రధాని ఫొటోలు దిగారు. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా మోడీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం భారత క్రికెటర్స్ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. భారత క్రికెటర్లు నేరుగా ముంబైకి వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు ఓపెన్ టాప్‌ బస్‌లో రోడ్‌షో ఉంటుంది. అభిమానులందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారు. అప్పటికే ముంబైలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. రోడ్‌షో అనంతరం వాంఖడేలో ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించనుంది. టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: Satyabhama Movie: టాప్ 1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’!

దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్‌ నెగ్గింది. చివరిగా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకోవడానికి ఏకంగా 17 ఏళ్లు పట్టింది. మొదటి ఎడిషన్ 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే భారత్ పొట్టి కప్ గెలిచింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర పడడంతో భారత అభిమానుల్లో చెప్పలేని ఆనందం నెలకొంది.

 

Show comments