India-England SemiFinal: ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దు అయితే ఎలా.. ఎవరు ఫైనల్‌కు వెళతారు..?

Ind Vs Eng

Ind Vs Eng

India-England SemiFinal: ICC T20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ పోరు బుధవారం (మార్చి 4న) కోల్‌కతాలో ప్రారంభం కాబోతోంది. తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. గురువారం (మార్చి 5)న జరిగే రెండో సెమీ ఫైనల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.

అయితే, వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయితే ఎలా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. కీలమైన సూపర్ -8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించడం ద్వారా భారత్ సెమీఫైనల్స్‌లోకి ప్రేవేశించింది. ఇప్పుడు, ఫైనల్ టార్గెట్‌గా టీమిండియా ఆడబోతోంది. మరోవైపు, ఇంగ్లాండ్ సూపర్-8లో మంచి ప్రదర్శన చేసింది. ఈ రెండు జట్ల మధ్య సెమీఫైనల్ రసవత్తరంగా మారబోతోంది.

1)రిజర్వ్ డే:

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే పరిస్థితి ఏంటనే ఆలోచనలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ రద్దు అయితే ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ గురువారం మార్చి 5న సాధ్యం కాకపోతే, మార్చి 6, శుక్రవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు.

మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందే, రిజర్వ్ డేలో అక్కడి నుంచి ప్రారంభిస్తారు. ఒక వేళ టాస్ పడి ఆట మొదలు కాకపోతే, రిజర్వ్ డే నాడు మళ్లీ టాస్ వేయరు. అదే టాస్, అదే ఆటగాళ్లలో బరిలోకి దిగాల్సి వస్తుంది.

2)అదనపు సమయం:

మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడితే ఫలితం తేల్చడానికి అంపైర్లు అదనంగా గురువారం 90 నిమిషాలు, శుక్రవారం 120 నిమిషాల సమయం కేటాయిస్తారు.

3)కనీస ఓవర్ల నిబంధన:

సెమీస్ ఫలితం తేలాలంటే, రెండు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాలి. వర్షం వల్ల ఓవర్లు తగ్గించినా, కనీసం 10 ఓవర్ల ఆట సాధ్యమైతే విజేత ఎవరనేది తేలుతుంది.

5)రెండో రోజు వర్షం పడితే మ్యాచ్ రద్దయితే..?:

ఒక వేళ నిర్ణీత రోజు అంటే గురువారం, రిజర్వ్ డే శుక్రవారం కూడా వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయితే, విజేతను సూపర్-8 పాయింట్ ఆధారంగా ప్రకటిస్తారు.

ఇదే జరిగితే సూపర్-8 గ్రూప్‌లో మూడు విజయాలతో ఇంగ్లాండ్ టాప్‌లో ఉంది. నేరుగా ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.