Site icon NTV Telugu

T20 World Cup controversy: భారత్‌లో టీ20 ఆడేది లేదన్న బంగ్లాదేశ్.. అంత ఈజీ కాదన్న బీసీసీఐ

Bangla

Bangla

T20 World Cup controversy: భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB)కి కీలక సూచనలు జారీ చేసింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లా.. భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ICC)కి అధికారికంగా చెప్పాలని, టోర్నమెంట్‌లో బంగ్లా మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయ వేదికగా శ్రీలంకను ఎంపిక చేయాలని తాత్కాలిక ప్రభుత్వం బీసీబీని ఆదేశించినట్లు నజ్రుల్ ఫేస్ బుక్ లోపోస్ట్ పెట్టారు.

Read Also: Dimple Hayathi : పూజలతో ఎవరూ స్టార్ అయిపోరు.. వేణు స్వామి పై డింపుల్ హయాతి షాకింగ్ కామెంట్స్!

ఇక, బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమన్ తో కాంట్రాక్ట్ పొందినప్పటికీ భారత్‌లో ఐపీఎల్‌ ఆడలేకపోతే.. టీ20 ప్రపంచ కప్ ఆడటానికి తమ దేశ జాతీయ జట్టు భారత్‌కు ప్రయాణించడం సురక్షితం కాదని క్రీడా మంత్రిత్వ శాఖకు ఇంఛార్జ్ సలహాదారుగా ఆసిఫ్ స్పష్టం చేశారు. ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని అధికారికంగా అభ్యర్థించాలని ఆదేశించామని నజ్రుల్ తన పోస్ట్‌లో వెల్లడించారు.

Read Also: Trump: వెనిజులా తర్వాత మీరే.. ఈ దేశాలకు ట్రంప్ బిగ్ వార్నింగ్..

అయితే, టోర్నీమెంట్ ప్రారంభానికి నెల రోజుల సమయం ఉండటంతో వేదికలను మార్చడం అసాధ్యమని బీసీసీఐ పేర్కొంది. ఒకరి ఇష్టానుసారం మీరు వేదికలను మార్చలేరని తెలిపింది. ప్రయాణపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.. బంగ్లాతో ఆడే ఇతర జట్ల నుంచి గురించి ఆలోచించన చేయండి.. వారి విమాన టిక్కెట్లు, హోటళ్లు బుక్ అయ్యాయి.. టోర్నీలో లీగ్ దశలో ప్రతిరోజు 3 మ్యాచ్‌లు ఉంటాయి. ఇందులో ఒకటి శ్రీలంకలో జరగనుంది.. బ్రాడ్‌కాస్టింగ్ విషయంలోనూ సమస్యలు వస్తాయి.. కాబట్టి, మ్యాచ్‌ల తరలింపు అనేది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనుకున్నంత ఈజీ కాదు అని బీసీసీఐ వెల్లడించింది.

Read Also: The Raja Saab: ‘సలార్’ మిస్ అయినా ‘రాజా సాబ్’తో కల నెరవేరింది!

కాగా, ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతుంది. గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్‌ ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌లను భారత్‌లోనే షెడ్యూల్ చేసేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్‌, 17న వాంఖడేలో నేపాల్‌తో మ్యాచ్‌లను బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది. బంగ్లాలో హిందువులపై వరుస దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఆడొద్దని బంగ్లాదేశ్‌ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.

Exit mobile version