IND vs SA T20 World Cup 2024 Final Live Updates: టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరు ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ అప్‌డేట్స్ కోసం..
-
ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్: ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. 168 పరుగుల దగ్గర రబాడ(4) ఔట్
-
మిల్లర్ ఔట్.. ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్
పాండ్యా వేసిన 19.1వ బంతికి మిల్లర్(21) ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. దక్షిణాఫ్రికాకు 5 బంతుల్లో 16 పరుగులు కావాలి.
-
అద్బుతంగా బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్
19వ ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దక్షిణాఫ్రికాకు 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. క్రీజులో మిల్లర్(21), మహరాజ్(2) ఉన్నారు.
-
2 రన్స్ మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన బుమ్రా
18వ ఓవర్‌లో 2పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు జస్ప్రీత్ బుమ్రా. 18 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా.
-
వికెట్ తీసిన బుమ్రా.. యన్సెన్ క్లీన్ బౌల్డ్
బుమ్రా వేసిన 17.4వ బంతికి యన్సెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
-
అద్భుతంగా బౌలింగ్ చేసిన పాండ్యా
పాండ్యా 17వ ఓవర్ అద్బుతంగా వేశాడు. ఒక వికెట్ తీసి 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
-
క్లాసెన్ ఔట్..
హార్ధిక్ పాండ్యా వేసిన 16.1వ బంతికి హెన్రిచ్ క్లాసెన్(52) ఔటయ్యాడు. రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
-
క్లాసెన్ హాఫ్ సెంచరీ
హెన్రిచ్ క్లాసెన్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 15.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా 150 పరుగులు చేసింది.
-
దంచికొడుతున్న క్లాసెన్
అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్‌లో క్లాసెన్ తనదైన శైలిలో దంచికొట్టాడు. 15వ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. దక్షిణాఫ్రికా 30 బంతుల్లో 30 కొడితే విజయం సాధిస్తుంది.
-
క్వింటాన్ డికాక్ ఔట్
సఫారీ జట్టు 4 వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్(39) ఔటయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 12.3వ బంతికి కుల్‌దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా స్కోరు 106/4.
-
దూకుడుగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్
హెన్రిచ్ క్లాసెన్ దూకుడుగా ఆడుతున్నాడు. 13 బంతుల్లో 23 పరుగులు చేశాడు.
-
10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 81/3
10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. డికాక్(30), క్లాసెన్(8) క్రీజులో ఉన్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. స్టబ్స్ ఔట్
అక్షర్ పటేల్ వేసిన 8.5వ బంతికి స్టబ్స్(31) బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి క్లాసెన్ వచ్చాడు.
-
సఫారీల దూకుడు.. సిక్సర్ బాదిన డికాక్
దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. కుల్‌దీప్ యాదవ్ వేసిన 8వ ఓవర్‌లో 13 పరుగులు రాబట్టారు. ఆ ఓవర్‌లో చివరి బంతికి డికాక్ సిక్సర్ బాదాడు.
-
7వ ఓవర్
దక్షిణాఫ్రికా 7 ఓవర్లలో 49 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(21), స్టబ్స్(23) ఉన్నారు.
-
దూకుడు పెంచిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు
దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడు పెంచారు. 6 ఓవర్లలో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేశారు. క్రీజులో డికాక్(20), స్టబ్స్(22) క్రీజులో ఉన్నారు.
-
5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 32/2
అక్షర్ పటేల్ వేసిన 5వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగులు రాబట్టింది. దక్షిణాఫ్రికా స్కోరు 32/2.
-
4 ఓవర్లలో దక్షిణాఫ్రికా 22/2
4 ఓవర్లలో దక్షిణాఫ్రికా 2వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డికాక్(10), స్టబ్స్(2) క్రీజులో ఉన్నారు.
-
మూడు ఓవర్లలో దక్షిణాఫ్రికా 14/2
3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 14/2 చేసింది. బుమ్రా,అర్ష్‌దీప్ తలో వికెట్ తీశారు.
-
వికెట్ తీసిన అర్ష్‌దీప్ సింగ్.. మార్‌క్రమ్ ఔట్
దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్ 3వ బంతికి మార్‌క్రమ్(4) ఔటయ్యాడు. వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
-
5 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసిన బుమ్రా
రెండో ఓవర్ వేసిన బుమ్రా 5 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. 2 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 12/1.
-
క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా
దక్షిణాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్ మూడో బంతికి రీజా హెండ్రిక్స్(4) బౌల్డ్ అయ్యాడు.
-
మొదటి ఓవర్‌లో దక్షిణాఫ్రికా 6/0
దక్షిణాఫ్రికా మొదటి ఓవర్‌లో 6 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(1), రీజా హెండ్రిక్స్(4) క్రీజులో ఉన్నారు.
-
ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా జట్టు ఛేదనకు దిగింది. భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మొదటి ఓవర్ వేశాడు. క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్ క్రీజులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా ఎదుట 177 పరుగుల లక్ష్యం ఉంది.
-
రాణించిన కోహ్లీ, అక్షర్ పటేల్.. దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?
దక్షిణాఫ్రికా ఎదుట భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 20 ఓవర్ చివరి బంతికి రవీంద్ర జడేజా(2) ఔటయ్యాడు. 177 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముంగిట ఉంచింది. విరాట్ కోహ్లీ (76), అక్షర్ పటేల్(47) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే,రబాడ రెండేసి వికెట్లు తీయగా.. షంసి, యన్సెన్‌లు తలో వికెట్ తీశారు.
-
దూబే ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన భారత్
శివమ్ దూబే(27) చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. అన్రిచ్ నోర్ట్జే వేసిన చివరి ఓవర్ 4వ బంతికి మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
-
కోహ్లీ ఔట్
విరాట్ కోహ్లీ(76) ఔటయ్యాడు. యన్సెన్ వేసిన 19వ ఓవర్ ఐదో బంతికి రబాడకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
-
దూకుడు పెంచిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ దూకుడు పెంచాడు. రబాడ వేసిన 18వ ఓవర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు. రెండో బంతికి 2 పరుగులు, మూడో బంతికి ఫోర్ కొట్టాడు కోహ్లీ. 18 ఓవర్లలో భారత్ స్కోరు 150/4. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (64), శివమ్ దూబే(22) ఉన్నారు.
-
హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 48 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ 134 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (50), శివమ్ దూబే(21) ఉన్నారు.
-
16 ఓవర్లలో భారత్ 126/4
మార్కో యన్సెన్ వేసిన 16వ ఓవర్‌లో భారత్ 8 పరుగులు చేసింది. 16 ఓవర్లకు భారత్ స్కోరు 126/4.
-
15 ఓవర్లలో భారత్ 118/4
యన్సెన్ వేసిన 15వ ఓవర్‌లో భారత్ 10 పరుగులు చేసింది. 15 ఓవర్లకు భారత్ స్కోరు 118/4. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(47), శివమ్ దూబే(9) ఉన్నారు.
-
14 ఓవర్లలో భారత్ 108/4
రబాడ వేసిన 14వ ఓవర్‌లో భారత్ 10 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. భారత్ స్కోరు 108/4.
-
4వ వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ పటేల్ ఔట్
భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్(47) రనౌట్‌గా వెనుదిరిగాడు.
-
13వ ఓవర్
అన్రిచ్ నోర్ట్జే వేసిన 13వ ఓవర్‌లో భారత్ స్కోరు 98/3. ఈ ఓవర్‌లో భారత్‌కు 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
-
12వ ఓవర్.. సిక్సర్ బాదిన అక్షర్ పటేల్
తబ్రెయిజ్ షంసి వేసిన 12వ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ మరో సిక్సర్ బాదాడు. 12 ఓవర్లకు భారత్ స్కోరు 93/3. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(41), అక్షర్ పటేల్(38) ఉన్నారు.
-
11వ ఓవర్
మార్కో యన్సెన్ వేసిన 11వ ఓవర్‌లో భారత్ 7 పరుగులు చేసింది. 11 ఓవర్లకు భారత్ స్కోరు 82/3. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(39), అక్షర్ పటేల్(29) ఉన్నారు.
-
10వ ఓవర్లలో భారత్ 75/3
తబ్రెయిజ్ షంసి వేసిన 10వ ఓవర్‌లో భారత్ 7 పరుగులు చేసింది. 10 ఓవర్లకు భారత్ 75/3. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(36), అక్షర్ పటేల్(26) ఉన్నారు.
-
9వ ఓవర్.. మరో సిక్సర్
కేశవ మహరాజ్ వేసిన 9వ ఓవర్‌లో మరో సిక్సర్ బాదాడు అక్షర్ పటేల్. 9 ఓవర్లకు భారత్ 68/3. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(31), అక్షర్ పటేల్(25) ఉన్నారు.
-
సిక్సర్ బాదిన అక్షర్
మార్‌క్రమ్ వేసిన 8వ ఓవర్‌లో భారత్ 10 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో తొలి సిక్సర్‌ను బాదాడు అక్షర్ పటేల్. 8 ఓవర్లకు భారత్ 59/3. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(29), అక్షర్ పటేల్(18) ఉన్నారు.
-
7వ ఓవర్
అన్రిచ్ నోర్ట్జే వేసిన 7వ ఓవర్‌లో భారత్ 4 పరుగులు మాత్రమే చేసింది. 7 ఓవర్లకు భారత్ 49/3. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(27), అక్షర్ పటేల్(11) ఉన్నారు.
-
6వ ఓవర్
మార్‌క్రమ్ వేసిన ఆరో ఓవర్‌లో భారత్ 6 పరుగులు చేసింది. 6 ఓవర్లకు భారత్ 45/3. క్రీజులో కోహ్లీ(25), అక్షర్ పటేల్(8) ఉన్నారు.
-
ఐదో ఓవర్
రబాడ వేసిన ఐదో ఓవర్‌లో ఇండియా 7 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.
-
మూడో వికెట్ కోల్పోయిన భారత్.. సూర్య ఔట్
భారత్ మూడో వికెట్ కోల్పోయింది. రబాడ వేసిన ఐదో ఓవర్ మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్(3) ఔటయ్యాడు. రబాడ వేసిన 4.3 ఓవర్‌కు క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది.
-
4 ఓవర్లలో భారత్ 32-2
4 ఓవర్లలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(21), సూర్యకుమార్ యాదవ్(2) ఉన్నారు.
-
మూడు ఓవర్లలో భారత్ 26-2
3 ఓవర్లలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.
-
రెండో వికెట్ కోల్పోయిన భారత్
భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహరాజ్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి రిషబ్ పంత్(0) ఔటయ్యాడు. 2 ఓవర్లలో భారత్ 23 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(14), సూర్యకుమార్ యాదవ్(0) ఉన్నారు.
-
మొదటి వికెట్
రెండో ఓవర్ లో నాల్గవ బంతికి టీమిండియా మొదటి వికెట్ ను చేజార్చుకుంది. రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యి పెవిలియన్ చేరాడు.
-
1 ఓవర్
మొదటి ఓవర్ ముగిసే సరికి 15 పరుగులు సాధించిన టీమిండియా.
-
ఇరుజట్ల ఆటగాళ్లు వీరే..
భారత్ ప్లేయింగ్ 11
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11
క్వింటన్ డి కాక్ (WK), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్ (c), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జెన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, తబ్రైజ్ షమ్సీ.
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ చేయనుంది. కాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆఖరి మ్యాచ్‌లో ఇరు జట్లు 11 మంది ఆడే విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
Kensington Oval, Bridgetown, Barbados | India win the toss and elected to bat first in the finals of the ICC T20 World Cup pic.twitter.com/wGXZ0ip06h
— ANI (@ANI) June 29, 2024