NTV Telugu Site icon

ఇండియా పాక్ మ్యాచ్‌లో దీన్ని జ‌యించిన జ‌ట్టుకే విజ‌యం…

ఇండియా పాక్ మ‌ధ్య ఏ మ్యాచ్ జ‌రిగినా దానిపై అంచ‌నాలు భారీగా ఉంటాయి. ఇక క్రికెట్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రెండు దేశాల మ‌ధ్య జ‌రిగే ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచం మొత్తం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లో ఇండియాపై పాక్ ఎప్ప‌డూ గెల‌వ‌లేదు. ఈసారి ఎలాగైనా గెలిచి చ‌రిత్ర‌ను సృష్టించాల‌ని పాక్ చూస్తున్న‌ది. అయితే, ప్ర‌పంచంలో ఇండియా జ‌ట్టు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌ట్టుగా ఎదిగింది. ఇండియాను ఓడించ‌డం అంత ఈజీ కాదు. టీ 20 మ్యాచ్ కాబ‌ట్టి ఒత్తిడి అధికంగా ఉంటుంది. టాస్ ద‌గ్గ‌రి నుంచి మ్యాచ్ ఎండింగ్ వ‌ర‌కు ప్ర‌తీ క్ష‌ణం చాలా జాగ్ర‌త్త‌గా ఆడాలి. ముఖ్యంగా ఒత్తిడిని ఎవ‌రైతే త‌ట్టుకొని ప్ర‌శాంతంగా ఆడుతారో వారిదే విజ‌యం అని నిపుణులు చెబుతున్నారు. జ‌ట్టు బ‌రిలోకి దిగిన త‌రువాత ఒత్తిడికి గురైతే ఆ ఒత్తిడే వారిని ఓడిస్తుంద‌ని, గ‌త మ్యాచ్‌ల విష‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఒత్తిడి లేకుండా ఆడాల‌ని క్రీడానిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని జ‌యించిన జ‌ట్టే విజ‌యం సాధించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇప్ప‌టికే రెండు వార్మ‌ప్ మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించిన ఇండియా మాన‌సికంగా బ‌లంగా ఉన్న‌ది. అంతేకాదు, గ‌త కొన్ని నెల‌లుగా ఇండియా విజ‌యాలు కూడా అందుకు క‌లిసివ‌స్తున్నాయి. ఐపీఎల్ లో రాణించిన ఆట‌గాళ్లు జ‌ట్టులో ఆడుతున్నారు. కాబ‌ట్టి ఇండియాకు ఇది క‌లిసివ‌చ్చే అంశంగా చెప్పుకోవాలి.

Read: సామాన్యుడిని భ‌య‌పెడుతున్న కాయ‌గూర‌లు…