IND vs NAM: ఇషాన్ కిషన్ మెరుపులు.. హార్దిక్ ఫినిషింగ్ టచ్! నమీబియాకు భారీ టార్గెట్

Ind Vs Nam

Ind Vs Nam

IND vs NAM: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న గ్రూప్-A మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నమీబియాకు భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.దీనితో నమీబియా గెలవాలంటే 210 పరుగులు చేయాలి.

Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తనదైన దూకుడును చూపించాడు. కేవలం 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 254.16 స్ట్రైక్‌రేట్ తో 61 పరుగులు చేసి నమీబియా బౌలర్లకు ఊచకోత అంటే ఏంటో రుచి చూపించాడు. ఇక ఇషాన్‌కు తోడుగా సంజు శాంసన్ కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి వేగాన్ని మరింత పెంచాడు. మొదటి రెండు ఓవర్లలోనే భారత్ 25 పరుగులు మంచి ప్రారంభం అందుకుంది.

చివర్లో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు. కేవలం 28 బంతుల్లో 52 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను 200 దాటించాడు. శివమ్ దూబే 23 పరుగులతో సహకరించాడు. తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (12) త్వరగా ఔటవడంతో భారత్ రన్‌రేట్ కాస్త తగ్గింది. చివరి ఐదు ఓవర్లలో భారత్ 41 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు కోల్పోయింది. దీనితో స్కోర్ వేగం మందగించింది.

Ragi Ambali Recipe: ఎండకాలం వచ్చేస్తుంది.. ఉపశమనం కోసం ‘రాగి అంబలి’! చేసేయండి ఇలా!

నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేశాడు. 4 ఓవర్లలో 20 పరుగులకే 4 కీలక వికెట్లు తీసి బ్యాటర్లను కంట్రోల్ చేశాడు. ఇక షికోంగో, జేజే స్మిట్, బెర్నార్డ్ స్కోల్ట్జ్ లు తలో వికెట్ సాధించారు.