NTV Telugu Site icon

Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!

Rohit Sharma Record

Rohit Sharma Record

Rohit Sharma breaks MS Dhoni’s record in T20 Cricket: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు అత్యధిక విజయాలు (43) అందించిన కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా బుధవారం న్యూయార్క్‌లోని నాసౌవ్‌ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించడంతో రోహిత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు.

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ఎంఎస్ ధోనీతో కలిసి రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐర్లాండ్‌పై విజయం అనంతరం టీ20ల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన సారథిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ (42), విరాట్ కోహ్లీ (32) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. బాబర్ అజామ్ (46) అగ్రస్థానంలో ఉండగా.. బ్రియాన్ మసాబా, ఇయాన్ మోర్గాన్ (44) రెండో స్థానంలో ఉన్నారు.

Also Read: Rohit Sharma Retd Hurt: అందుకే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగా: రోహిత్

పొట్టి ఫార్మాట్‌లో 4,000 ర‌న్స్ బాదిన మూడో బ్యాట‌ర్‌గా రోహిత్ శర్మ మరో రికార్డు సృష్టించాడు. త‌ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాంల స‌ర‌స‌న చేరాడు. ప్ర‌స్తుతం విరాట్ 4,038 ర‌న్స్‌తో అగ్ర‌స్థానంలో ఉండ‌గా.. బాబ‌ర్ 4,023 ప‌రుగులతో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 19 వేల ప‌రుగుల మైలురాయికి రోహిత్ చేరువ‌లో ఉన్నాడు. 19 వేలు కొడితే.. ఈ ఫీట్ సాధించిన 14 బ్యాట‌ర్‌గా హిట్‌మ్యాన్ మ‌రో రికార్డు ఖాతాలో వేసుకుంటాడు.

Show comments