NTV Telugu Site icon

IND vs SA Final: మ్యాచ్ కు వర్షం అడ్డంకైతే.. పరిస్థితి ఏంటి..?

Ind Vs Sa Final

Ind Vs Sa Final

IND vs SA Final: నేడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో తలపడుతుంది టీమిండియా. బార్బడోస్ వేదికగా మ్యాచ్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలు కానుంది. ఒకవేళ వర్షం వల్ల అంతరాయం కలిగితే.. రేపు రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకుంటే ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత్, సౌతాఫ్రికా జట్లు. టీ20 వరల్డ్ కప్ లో తొలిసారి ఫైనల్ చేరింది సౌతాఫ్రికా జట్టు. ఇక నేటి మ్యాచ్ లో టీమిండియా లో ఒక మార్పు తో బరిలోకి దిగే అవకాశం కనపడుతింది. వరుసగా విఫలమవుతున్న శివం దూబే స్థానంలో యశస్వి జైస్వాల్ కు చోటు కల్పించే అవకాశం ఉంది.

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం.. గజమాలతో సన్మానం

జైస్వాల్ టీంలోకి వస్తే.. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్ రావచ్చు. దాంతో తిరిగి తన స్థానం వన్ డౌన్ లో ఆడుతాడు విరాట్ కోహ్లీ. కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కెరీర్ లో ఇదే చివరి మ్యాచ్ కానుండటంతో వరల్డ్ కప్ విక్టరీ తో కెరీర్ ముగించాలనుకుంటున్నాడు. ఇకపోతే ఫైనల్ మ్యాచ్ కి పొంచి ఉన్న వర్షం ముప్పు ఉంది. బార్బడోస్‌ లోని బ్రిడ్జ్‌టౌన్‌ లో 78 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడి టైం ప్రకారం ఉదయం 10.30 కి మ్యాచ్ స్టార్ట్ అవ్వాలి. కానీ., బార్బడోస్‌లో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెల్లవారుజామున 3 నుంచి 10 గంటల వరకు దాదాపు 50 శాతం వర్షం.., ఉదయం 11 గంటలకు తుఫానుతో కూడిన వర్షం కురిసే అవకాశం 60 శాతం ఉన్నట్లు చెప్పిన వాతావరణ శాఖ వెల్లడించింది. టాస్ వేసినా మ్యాచ్‌ ని మధ్యలోనే ఆపేయడం ఖాయం అన్నట్లుగా వాతావరణం ఉంది. ఇక 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వర్షం కురిసే అవకాశం 40 శాతం ఉందని వెదర్ రిపోర్ట్ ఉంది. ఈరోజు మ్యాచ్ కి అంతరాయం వాటిల్లితే మ్యాచ్ రేపటికి వాయిదా పడుతుంది.

Leopard: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం.. బెదిరిపోతున్న భక్తులు..!

ఇక టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, సౌతాఫ్రికా మధ్య ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు జరగ్గా అందులో ఇండియా 4 గెలిచి.. 2 ఓడింది. 2007లో జరిగిన తొలి ఎడిషన్‌లో భారత్‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2009లో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2010లో సౌతాఫ్రికాపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2012 లో ఒక పరుగు తేడాతో భారత్ విజయం సాధించింది. 2014లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక చివరిసారిగా 2022 లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.