NTV Telugu Site icon

Hardik Pandya: లండన్‌కు హార్దిక్‌ పాండ్యా.. నేరుగా అమెరికాకు!

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya joins Team India Form London: ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్ ఘోర పరాభవం, భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడనే కథనాల నేపథ్యంలో టీమిండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్యా భారత్‌ నుంచి లండన్‌కు వెళ్లాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం యూఎస్ వెళ్లకుండా.. లండన్‌కు వెళ్లాడు. అక్కడి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని.. నేరుగా అమెరికాకు వెళ్లి భారత జట్టుతో కలిశాడు. అమెరికాలో టీమ్ సభ్యులతో ఉన్న ఫొటోలను హార్దిక్ షేర్ చేశాడు.

జర్నలిస్ట్ విమల్ కుమార్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా లండన్‌లో ఉన్నారని చెప్పారు. త్వరలోనే అమెరికాకు వెళ్లి.. భారత జట్టుతో చేరుతాడని పేర్కొన్నారు. తాను ఆలస్యంగా వస్తానని బీసీసీఐకి హార్దిక్ ముందే చెప్పాడని, అతని అభ్యర్థనని బోర్డు అనుమతించిందని సమాచారం. మరి వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్న హార్దిక్.. టీ20 ప్రపంచకప్‌ 2024లో ఎలా రాణిస్తాడో అని ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో బ్యాట్, బంతితో హార్దిక్ విఫలమయిన విషయం తెలిసిందే. చూడాలి మరి హార్దిక్ ఎలా రాణిస్తాడో.

Also Read: Yashasvi-Suryakumar: తోటల్లో తిరుగుతున్నట్లు రోహిత్‌కు తెలుసా.. యశస్విని ట్రోల్ చేసిన సూర్య!

హార్దిక్ పాండ్యా మాదిరే సంజూ శాంసన్, రింకు సింగ్‌ కూడా వేర్వేరుగా యూఎస్‌కి వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి తొలి బ్యాచ్‌తోనే కలిసి సంజూ అమెరికాకు వెళ్లాల్సింది. కానీ దుబాయ్‌లో వ్యక్తిగత పని కారణంగా విడిగా వెళ్లాల్సి వచ్చిందట. మరోవైపు కేకేఆర్ ఫైనల్ చేరడంతో రింకు లేటుగా వెళ్లాల్సి వచ్చింది. మెగా టోర్నీ జూన్ 2 నుంచి ఆరంభం కానుండగా.. జూన్ 5న రోహిత్ సేన తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. అంతకుముందు జూన్ 1న బంగ్లాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.