NTV Telugu Site icon

IND vs ENG: భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్‌ మ్యాచ్.. లేటెస్ట్‌ వెదర్ అప్‌డేట్‌ ఇదే!

Guyana Weather Forecast

Guyana Weather Forecast

India vs England Weather Report in Guyana: టీ20 ప్రపంచకప్‌ 2024 మొదటి సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్‌ మీదే ఉంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ ఆసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉండటం మరింత ఉత్కంఠ రేపుతోంది.

ప్రస్తుతం గయానాలో వాతావరణం పొడిగానే ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయట. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తాజాగా వెల్లడించింది. రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్‌డే లేనందున ఇరు జట్ల ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Also Read: Anant Ambani Wedding: స్టార్ హీరోల ఇంటికి అనంత్‌ అంబానీ.. పెళ్లికి రావాలంటూ ప్రత్యేక ఆహ్వానం!

భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్‌డే లేకున్నా.. అదనంగా 250 నిమిషాల సమయం కేటాయించారు. ఈ లోగా మ్యాచ్ పూర్తవ్వాలి. వర్షం కారణంగా ఆటంకం కలిగితే.. కుదించిన ఓవర్లతో మ్యాచ్ సాగనుంది. రెండు జట్లూ కనీసం 10 ఓవర్ల చొప్పున ఆడితేనే.. ఫలితాన్ని ప్రకటిస్తారు. అలా జరగని పక్షంలో మ్యాచ్‌ రద్దవుతుంది. మ్యాచ్‌ రద్దయితే భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది. సూపర్‌-8లో భారత్‌ గ్రూప్‌-1లో అగ్రస్థానంలో ఉండడమే కారణం. చూడాలి మరి నేడు వరణుడు కరుణిస్తాడో లేదో.