ENG vs OMA: చెలరేగిన బట్లర్.. 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ విజయం!
- ఒమన్‌పై ఇంగ్లండ్ పంజా
- షోయబ్ ఖాన్ మాత్రమే
- ఇంగ్లండ్ సూపర్-8 ఆశలు సజీవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Chased 48 runs in 3.1 overs against Oman: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. ఆంటిగ్వా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై ఇంగ్లీష్ టీమ్ పంజా విసిరింది. ఒమన్ నిర్ధేశించిన 48 పరుగుల లక్షాన్ని ఇంగ్లండ్ రెండు వికెట్స్ కోల్పోయి 3.1 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ జోస్ బట్లర్ (24 నాటౌట్; 8 బంతుల్లో 4X4, 1X6) ఒమన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు అదిల్ రషీన్ (4/11), మార్క్ వుడ్ (3/12), జోఫ్రా ఆర్చర్ (3/12) దెబ్బకు ఒమన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. ఒమన్ బ్యాటర్లలో షోయబ్ ఖాన్ (11; 23 బంతుల్లో 1X4) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నాడు. ప్రతీక్ అథవాలే (5), కశ్యప్ (9), అకిబ్ ఇలియాస్ (8), జీషన్ మక్సూద్ (1), ఖలీద్ కైల్ (1), అయాన్ ఖాన్ (1) విఫలమయ్యారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Euro Cup 2024: నేటి నుంచే యూరో కప్.. బరిలో 24 జట్లు!
స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 3.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. తొలి రెండు బంతులను ఫిల్ సాల్ట్ (12; 3 బంతుల్లో 2X6) స్టాండ్స్‌కు తరలించాడు. మూడో బంతికి మరో షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆపై జోస్ బట్లర్ చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ (5) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. జానీ బెయిర్‌స్టో ఆడిన రెండు బంతులను బౌండ్రీలకు తరలించడంతో ఇంగ్లండ్ భారీ విజయాన్ని అందుకుంది.
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!