Site icon NTV Telugu

IND vs CAN: చిత్త‌డిగా ఔట్‌ ఫీల్డ్.. మ్యాచ్ ఆల‌స్యం..

Ind Vs Can

Ind Vs Can

ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటికే సూపర్ 8కు చేరిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయం అందుకున్న రోహిత్ సేన నేడు కెనడాతో మ్యాచ్ ఆడనుంది. అయితే భారత కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మొదలు అవ్వాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిక్కడగా మారడంతో ఆలస్యం అవుతుంది. షెడ్యూల్ ప్రకారం ఏడున్నర గంటలకు టాస్ వేయాల్సిన అంపైర్లు దానిని కూడా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అంపైర్లు రిఫరీలు 8 గంటల సమయంలో అవుట్ ఫీల్డ్ ను పరిశీలించి టాస్ టైమింగ్ ను తెలపలమన్నారు.

అయితే ఎనిమిది గంటలకు అంపైర్లు ఫీల్డ్ పరిశీలించిన తర్వాత మ్యాచ్ 9 గంటల సమయంలో ప్రారంభం అవుతుందన్నట్లుగా తెలిపారు. ఇకపోతే శుక్రవారం నాడు ఇదే స్టేడియంలో జరగాల్సిన అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. ఇక నేడు జరిగే మ్యాచ్ లో ఆడబోయే రెండు టీమ్స్ ఆటగాళ్ల వివరాలు ఒకసారి చూస్తే..

భార‌త జ‌ట్టులో రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), సూర్య‌కుమార్ యాద‌వ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్, జ‌స్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్ లను అంచనా వేయవచ్చు.

కెన‌డా జ‌ట్టులో అరోన్ జాన్స‌న్, న‌వ్‌నీత్ ధ‌లివ‌ల్, ప‌ర్గాత్ సింగ్, నికోల‌స్ కిర్ట‌న్, శ్రేయాస్ మొవ్వ‌(వికెట్ కీప‌ర్), దిల్‌ప్రీత్ బ‌జ్వా, సాద్ బిన్ జాఫ‌ర్(కెప్టెన్), డిల్లాన్ హెల్గెర్, క‌లీమ్ స‌నా, జునైద్ సిద్దిఖీ, జెరెమె గోర్డ‌న్ లను అంచనా వేయవచ్చు.

Exit mobile version