NTV Telugu Site icon

Rohit Sharma: టీ20 రిటైర్మెంట్ గురించి రోహిత్ ముందుగా ఎవరికి చెప్పాడో తెలుసా?

Rohit Sharma Trophy

Rohit Sharma Trophy

Rohit Sharma Mother Purnima Sharma Speech in Wankhede: టీమిండియా స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ 2024 విజేతగా నిలిచిన అనంతరం హిట్‌మ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్ తరఫున రోహిత్ చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్ట్, వన్డేలలో మాత్రం హిట్‌మ్యాన్ కొనసాగనున్నాడు. అయితే టీ20 రిటైర్మెంట్ గురించి రోహిత్ ముందుగా తన తల్లికి చెప్పాడట. ఈ విషయాన్ని రోహిత్ తల్లి స్వయంగా చెప్పారు.

టీ20 ప్రపంచకప్‌ 2024లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ముంబైలో విజయయాత్రను బీసీసీఐ ఘనంగా నిర్వహించింది. యాత్ర సాగిన మెరైన్‌డ్రైవ్‌ రోడ్డు జన సంద్రాన్ని తలపించింది. విజయయాత్ర అనంతరం భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియంకు చేరుకున్నారు. అక్కడ ప్లేయర్స్ తమ కుటుంబసభ్యులను కలిసి భావోద్వేగం చెందారు. రోహిత్ శర్మ తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం వారిని కౌగలించుకుని తన ఆనందంను పంచుకున్నారు. రోహిత్ తల్లి ఆనందంలో తన కుమారుడికి ముద్దులు పెట్టింది. ఇందుకుసంబందించిన వీడీయోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.

Also Read: Mohammed Siraj: నేడు హైదరాబాద్‌లో మహమ్మద్‌ సిరాజ్‌ రోడ్ షో.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం వెళ్లేముందు తనను రోహిత్ కలిశాడని చెప్పారు. అప్పుడే తన టీ20 రిటైర్మెంట్ గురించి గురించి హిట్‌మ్యాన్ చెప్పాడని పేర్కొన్నారు. ‘నేను ఈ రోజును చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. టీ20 ప్రపంచకప్‌ 2024కు వెళ్లేముందు రోహిత్ మమ్మల్ని కలవడానికి వచ్చాడు. ప్రపంచకప్‌ తర్వాత టీ20ల నుండి నిష్క్రమించాలనుకుంటున్నా అని చెప్పాడు. అప్పుడు నేను కప్ గెలవడానికి ప్రయత్నించండని చెప్పా. కప్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఈరోజు నాకు బాగా లేదు, డాక్టర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నా. కానీ హిస్పిటల్ వెళ్ళలేదు. నేను భారత్ విజయోత్సవాలను చూడాలనుకున్నా’ అని పూర్ణిమ తెలిపారు.