NTV Telugu Site icon

Azmatullah Omarzai: ఒకే ఓవర్‌లో 36 పరుగులు.. రెండో చెత్త బౌలర్‌గా ఒమర్జాయ్ రికార్డు!

Azmatullah Omarzai 36 Runs

Azmatullah Omarzai 36 Runs

Azmatullah Omarzai created an unwanted record T20 World Cup: అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా సెయింట్‌ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 36 రన్స్ ఇచ్చుకున్నాడు. విండీస్ హిట్టర్ నికోలస్‌ పూరన్‌ దెబ్బకు ఒమర్జాయ్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది.

విండీస్‌ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను అజ్మతుల్లా ఒమర్జాయ్ వేయగా.. నికోలస్‌ పూరన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి 36 పరుగులు రాబట్టుకున్నాడు. మొదటి బంతిని సిక్సర్‌గా బాదిన పూరన్‌.. రెండో బంతిని బౌండరీకి తరలించాడు. అయితే అది నోబాల్ కాగా.. ఫ్రీహిట్‌ను భారీ వైడ్‌‌గా వేయడంతో అది బౌండరీకి వెళ్ళింది. తర్వాత వేసిన ఫ్రీహిట్ బాల్‌‌కు పరుగులేమి రాలేదు. అయితే మూడో బంతికి లెగ్‌బై రూపంలో బౌండరీ లభించింది. నాలుగొ బంతి ఫోర్ కాగా.. అయిదో బంతి సిక్సర్‌గా వెళ్ళింది. ఇక ఆఖరి బంతి కూడా సిక్సర్‌ వెళ్లడంతో ఏకంగా 36 పరుగులు వచ్చాయి.

Also Read: Fastest Century: 27 బంతుల్లోనే సెంచరీ.. క్రిస్ గేల్ ‘ఆల్‌టైమ్’ రికార్డు బ్రేక్‌!

టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్‌ బౌలింగ్‌లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 36 పరుగులు పిండుకున్నాడు. యువీ ఆరు బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 36 పరుగులు వచ్చాయి. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఎక్స్‌ట్రాస్‌ రూపంలో 10 పరుగులు సమర్పించుకున్నాడు.

Show comments