Site icon NTV Telugu

Australia Cricket History: ఈసారి వరల్డ్‌ కప్‌ ఆస్ట్రేలియాదే.. ఈ గణాంకాలు చూస్తే మీరు కూడా నిజమే అంటారు!

Australia Cricket History

Australia Cricket History

క్రికెట్ ప్రపంచంలో కొన్ని జట్లు ఐసీసీ ట్రోఫీలు గెలిస్తే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆది నుంచి క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా ఇప్పటికే ఎన్నో కప్పులు గెలిచింది. అయితే ఆసీస్ ఐసీసీ ట్రోఫీలు గెలిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు కానీ.. మెగా టోర్నీ మూడు ఆ జట్టు ఓడడం మాత్రం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఐసీసీ టోర్నీల ముందు సిరీస్‌లు ఓడినప్పుడల్లా.. ట్రోఫీ కొడుతోంది. ఆసీస్ సిరీస్ ఓడితే బలహీనపడిందని కాదు.. యుద్ధానికి సిద్ధమవుతోందని చరిత్రే చెబుతోంది. ఆ గణాంకాలు ఓసారి చూద్దాం.

2007 వరల్డ్‌ కప్‌:
2007 వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఆటగాళ్ల ఫామ్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ వరల్డ్ కప్ వచ్చేసరికి కథ మొత్తం మారిపోయింది. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.

2021 టీ20 వరల్డ్ కప్:
2021 టీ20 వరల్డ్ కప్‌కు ముందు కూడా ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో పరాజయం పాలైంది. ఈ టీమ్‌కు టీ20లు సూటవ్వవు అన్న మాటలు వినిపించాయి. కానీ టోర్నీలో అడుగుపెట్టిన తర్వాత ఆసీస్ పూర్తిగా మారి మొదటిసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది.

2023 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్:
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. అయినా ఫైనల్‌లో మాత్రం క్లాస్ చూపించింది. అనుభవం, మెంటల్ స్ట్రెంగ్త్‌తో ప్రత్యర్థిని దెబ్బతీసి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ మేస్‌ను సొంతం చేసుకుంది.

Also Read: గూగుల్ నుంచి తొలి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. Google Pixel Lite సిరీస్ ధర, స్పెసిఫికేషన్స్‌ డీటెయిల్స్ ఇవే!

2023 వన్డే వరల్డ్ కప్:
2023 వన్డే వరల్డ్ కప్‌కు ముందు కూడా ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను ఓడిపోయింది. కానీ వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత నెమ్మదిగా పుంజుకుని.. కీలక మ్యాచ్‌ల్లో అసలు ఆట చూపించి చివరికి వరల్డ్ కప్ ట్రోఫీని మళ్లీ ఎత్తుకుంది.

2026 టీ20 వరల్డ్ కప్:
ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా మరోసారి టీ20 సిరీస్‌ను కోల్పోయింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఒక్క ప్రశ్న మెదులుతోంది. ఈసారి కూడా అదే స్టోరీ రిపీట్ అవుతుందా? అని. చరిత్రను చూస్తే ఆస్ట్రేలియా సిరీస్ ఓడినప్పుడల్లా బలహీనంగా కాకుండా.. టోర్నీ కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతోందన్న భావన బలంగా కనిపిస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version