Highest individual scores for India in T20 World Cups: టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు (97 నాటౌట్; 50 బంతుల్లో 12×4, 4×6) చెలరేగడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా అగ్రస్థానంలో ఉన్నాడు. 2010 టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై రైనా 101 పరుగులు చేశాడు. రైనా ఇన్నింగ్స్ భారత టీ20 చరిత్రలో క్లాసిక్ ప్రదర్శనగా రికార్డుల్లో ఉంది.
వెస్టిండీస్‌పై 97 పరుగులతో అదరగొట్టిన సంజు శాంసన్ ఈ జాబితాలో రెండో స్థానంలోకి వచ్చాడు. కష్ట సమయంలో జట్టును నిలబెట్టిన సంజు ఇన్నింగ్స్.. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనగా నిలిచింది. అతడి బ్యాటింగ్ స్టైల్, షాట్ సెలక్షన్ అభిమానులను ఆకట్టుకుంది. మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. 2024 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 92 పరుగులతో సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ 2016లో వెస్టిండీస్‌పై చేసిన 89 నాటౌట్ ఇన్నింగ్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 2026లో అమెరికాపై 84 పరుగులతో మెరిశాడు.
Also Read: Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!
T20 ప్రపంచ కప్‌లలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:
101 సురేష్ రైనా vs దక్షిణాఫ్రికా, గ్రోస్ ఐలెట్ 2010
97 నాటౌట్ సంజు శాంసన్ vs వెస్టిండీస్, ఈడెన్ గార్డెన్స్ 2026
92 రోహిత్ శర్మ vs ఆస్ట్రేలియా, గ్రోస్ ఐలెట్ 2024
89 నాటౌట్ విరాట్ కోహ్లీ vs వెస్టిండీస్, వాంఖడే 2016
84 నాటౌట్ సూర్యకుమార్ యాదవ్ vs అమెరికా, వాంఖడే 2026
