Site icon NTV Telugu

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించినా.. బంగ్లాదేశ్‌కు ఐసీసీ శుభవార్త!

ICC Bangladesh Decision

ICC Bangladesh Decision

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌పై కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌ ఆదుకుంటే.. కఠిన చర్యలు తప్పవని పీసీబీకి ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. పీసీబీ డిమాండ్స్ పెట్టినా ఐసీసీ అందుకు ఒప్పుకోలేదు. చివరకు పీసీబీ వెనక్కి తగ్గగా.. భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే భద్రతా కారణాలతో భారత్‌లో మ్యాచ్ ఆడలేమంటూ బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి తప్పుకుంది. బంగ్లాపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందని అందరూ అందుకున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదని ఐసీసీ స్పష్టం చేసింది. అంతేకాదు ఓ శుభవార్త కూడా చెప్పింది.

సోమవారం రాత్రి కీలక ప్రెస్ రిలీజ్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎలాంటి చర్యలు ఉండబోవని ఐసీసీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో బీసీబీకి పెద్ద ఊరట లభించినట్లైంది. టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన వివాదాల నేపథ్యంలో బీసీబీపై చర్యలు ఉంటాయన్న ప్రచారం జరిగింది. అయితే ఐసీసీ ఆ అన్ని ఊహాగానాలకు తెరదించింది. బంగ్లాదేశ్‌పై ఎలాంటి ఆంక్షలు, జరిమానాలు ఉండవని స్పష్టం చేస్తూ.. క్రికెట్ అభివృద్ధికి బీసీబీ చేస్తున్న కృషిని గుర్తించినట్లు తెలిపింది.

Also Read: Indraja: వినూత్న పాత్రలో సీనియర్ నటి ఇంద్రజ!

బంగ్లాదేశ్ క్రికెట్‌కు మరో శుభవార్తను కూడా ఐసీసీ ప్రకటించింది. 2028 నుంచి 2031 మధ్య జరిగే ఒక ఐసీసీ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించింది. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ మౌలిక వసతులు, నిర్వహణ సామర్థ్యంపై ఐసీసీకి ఉన్న నమ్మకానికి నిదర్శనంగా భావిస్తున్నారు. ఈ ప్రకటనతో బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఐసీసీ నిర్ణయం బీసీబీకి అంతర్జాతీయ క్రికెట్ వేదికపై మరింత గౌరవం తీసుకువస్తుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో బంగ్లాదేశ్‌లో జరిగే ఐసీసీ టోర్నీ క్రికెట్ ప్రపంచంలో మరో కీలక ఘట్టంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Exit mobile version