T20 World Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్.. ఆ అస్త్రాన్ని భారత్‌పై ప్రయోగించడం అసాధ్యం!
- మరోసారి వివాదంలో స్పిన్నర్ ఉస్మాన్ తారిక్
- తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై ప్రశ్నలు
- పాకిస్తాన్‌కు భారీ షాక్ తప్పేలా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఇప్పటికే అనేకసార్లు ప్రశ్నలు తలెత్తగా.. ఇప్పుడు అవి మరింత తీవ్రతరం అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోందట. ఈ పరిణామం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తారిక్ బౌలింగ్ చేయడమే ఇందుకు కారణం.
రెండో టీ20 మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ క్యామరూన్ గ్రీన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో గ్రీన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. 20 బంతుల్లో 35 పరుగులు రన్స్ చేశాడు. అయితే తారిక్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి.. షాదాబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పెవిలియన్ వైపు నడుస్తూ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై గ్రీన్ అసహనం వ్యక్తం చేశాడు. తారిక్ బౌలింగ్ యాక్షన్‌ను చకింగ్ చేయండి అని, బంతిని త్రోగా విసురుతున్నాడని సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక అంతర్జాతీయ స్టార్ ఆటగాడు బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది.
Also Read
- Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
- Rohit Sharma: నువ్వు నిజమైన లెజెండ్.. తెర వెనుక ఎంతగానో కష్టపడ్డావ్.. రోహిత్ భావోద్వేగ పోస్ట్!
- Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!
- PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
ఉస్మాన్ తారిక్‌పై ఇలాంటి ఆరోపణలు ఇదే తొలిసారి కాదు. గతంలో ILT20 లీగ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ టామ్ బాంటన్ కూడా అతడి యాక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతేకాదు పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో కూడా బౌలింగ్ యాక్షన్ కారణంగా తారిక్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వివిధ లీగ్‌ల్లో అతడు ఆడుతుండటం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా ఐసీసీకి ఫిర్యాదు చేస్తే.. తారిక్‌పై అధికారిక విచారణ జరగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఐసీసీ అతడి బౌలింగ్ యాక్షన్‌ను బయోమెకానికల్ టెస్ట్‌కు పంపించే అవకాశం ఉంది. ఒకవేళ బౌలింగ్ యాక్షన్ అక్రమమని తేలితే.. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు లీగ్‌ల్లో కూడా అతడికి నిషేధం పడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Venkatesh Remuneration: ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్.. వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్?
ఉస్మాన్ తారిక్ గతంలో ఓ మ్యాచ్‌లో హ్యాట్రిక్ పడగొట్టి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ మ్యాచ్ తర్వాత బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు రావడంతో.. గత రెండు సిరీస్‌లలో పాకిస్థాన్ అతడిని ఆడించలేదు. టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో తారిక్‌ను ఆడించాలని పాక్ ప్లాన్ వేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వరల్డ్‌కప్‌కు ముందు అధికారికంగా యాక్షన్ టెస్టులు, నిషేధాల నుంచి తప్పించుకోవడానికే ఈ వ్యూహమని వార్తలు వచ్చాయి. అయితే ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో తారిక్ బౌలింగ్ చేశాడు. ఇప్పుడు వివాదంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్ ఫిర్యాదు చేస్తే.. భారత్‌పై తారిక్ అస్త్రంను ప్రయోగించలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
-
Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
Ravi Teja : సెంటిమెంట్స్‌ను పట్టించుకోని రవితేజ.. చైల్డ్ సెంటిమెంట్ హిట్ తీసుకొస్తుందా?
-
Rohit Sharma: నువ్వు నిజమైన లెజెండ్.. తెర వెనుక ఎంతగానో కష్టపడ్డావ్.. రోహిత్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!