Site icon NTV Telugu

Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!

Suryakumar Sanju Samson

Suryakumar Sanju Samson

Suryakumar Yadav Praises Sanju Samson: టీ20 ప్రపంచ కప్ 2026 విజయం అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రయాణం, సహచర ఆటగాళ్ల పాత్ర, కోచ్ మార్గదర్శకతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా టీమిండియా కొత్త దిశలో ముందుకు సాగుతోందని తెలిపాడు. ఈ ప్రయాణం ఒక్కసారిగా వచ్చిన విజయమేమీ కాదని, దీని వెనుక చాలా కాలంగా పడిన కష్టం ఉందని చెప్పాడు. ఐసీసీ అధ్యక్షుడు జై షా తనపై ఉంచిన నమ్మకమే భారత జట్టును కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లిందని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్

సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉన్నాను. ఇది సుదీర్ఘ ప్రయాణం. 2024 ప్రపంచ కప్ తర్వాత జట్టులో వచ్చిన మార్పులే ఈ విజయానికి కారణం. ఆ సమయంలో బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా నాపై నమ్మకం ఉంచారు. జై షా సహా రోహిత్ (శర్మ) భాయ్, మిగతా జట్టు సభ్యులు అందరూ నాపై విశ్వాసం ఉంచి.. జట్టుకు నాయకత్వం వహించడానికి అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకమే జట్టును కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లింది. ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియంలో బిగ్ విక్టరీ అందుకున్నాము. ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి. భారత జట్టుకు సారథ్యం వహించడం, ప్రపంచ కప్ అందించడం నా జీవితంలో చాలా ప్రత్యేకం. ఈ క్షణాలను ఎప్పటికీ అమర్చిపోలేను’ అని తెలిపాడు.

Also Read: Hardik Pandya: నా సక్సెస్‌కు కారణం ఆమె.. ఇంకా పదేళ్లు ఆడుతా, పది ట్రోఫీలు గెలుస్తా!

వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ గురించి మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘సంజు శాంసన్ జట్టులోకి రావడానికి ఇదే సరైన సమయమని భావించాం. సంజూ తన ప్రతిభతో జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. వరుసగా మూడు కీలక మ్యాచులలో బ్యాట్ జులిపించాడు. అతడు అద్భుత ఆటగాడు. సంజు రాకతో అంతా మారిపోయింది. వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలు తమ ప్రతిభను నిరూపిస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. జట్టులో సీనియర్ ఆటగాళ్ల పాత్ర కూడా ఎంతో ముఖ్యం. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు జట్టుకు వెన్నెముక లాంటి వారు. జట్టుకు మార్గనిర్దేశం చేస్తున్నారు. వీరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఇక కోచ్ గౌతమ్ గంభీర్ అద్భుతం. గంభీర్‌కు జట్టుకు ఏమి అవసరం, ఎలా చేయాలి అన్నది బాగా తెలుసు. ఆయన మార్గదర్శకతలో టీమిండియా మరింత బలంగా మారుతుంది’ అని సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు.

 

Exit mobile version