Site icon NTV Telugu

Suryakumar Yadav : నాకు టాటూలు వేసుకోవడానికి మొహం తప్ప వేరే ఆప్షన్ లేదు..

Surya

Surya

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌కు టాటూలు అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూర్య శరీరం చూస్తే అందరికి అర్ధమయిపోతుంది. కాళ్లు, చేతులు, మెడ, వీపు, ఛాతి ఎక్కడ చూసినా టాటూలే కనిపిస్తాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ టాటూలు సూర్యకుమార్‌కే ఉన్నాయి. ఇక సూర్యకు టాటూలు వేసుకోవడానికి మొహం తప్ప వేరే ఆప్షన్ లేదనే మనకు తెలుస్తోంది. అయితే ఇన్ని టాటూలు తన కుటుంబ సభ్యుల అనుమతితోనే వేసుకున్నాడట.

Also Read : Avinash Group Of Institution: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్

ప్రస్తుతం ఐపీఎల్‌ 2023లో ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌.. తాజాగా జియో సినిమాతో మాట్లాడాతు.. సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టాటూలు వేయించుకోవాలని ఎందుకు అనిపించింది? అనే ప్రశ్నాకు.. సమాధానం ఇస్తూ.. తాను వేయించుకున్న ఫస్ట్ టాటూ ఏంటో సూర్య చెప్పాడు. నేను మొదటిసారి న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లినపుడు అక్కడ చాలామంది టాటూలు వేసుకోవడం చూశా. మా అమ్మానాన్నల అనుమతి తీసుకొని వాళ్ల పేరునే తొలి టాటూగా వేయించుకున్నాను అని సూర్యకుమార్‌ చెప్పాడు.

Also Read : Hair loss: ఊబకాయం జట్టు రాలడాన్ని పెంచుతుందా..? నిపుణులు చెబుతున్నది ఇదే..

తొలి టాటూ తర్వాత ఇక టాటూలు వేయించుకునే అలవాటు ఆగలేదు అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. ఆ తర్వాత తన భార్య అనుమతి తీసుకోని ఆమె పేరును ఛాతిపై టాటూగా వేయించుకున్నాట్లు వెల్లడించాడు. ఆ తర్వాత మరిన్ని టాటూలకు అనుమతి లభించింది. ఆ తర్వాత టాటూలు వేయించుకుంటూ వెళ్లాను. ఇప్పుడు నా శరీరంపై ఖాళీ ఎక్కడ ఉందా? అని చూస్తున్నా అని సూర్యకుమార్‌ యాదవ్ పేర్కొన్నాడు.

Exit mobile version