Suryakumar Yadav Record: కెప్టెన్‌గా సూర్యకుమార్ అజేయ రికార్డు.. టీ20ల్లో ఒక్క ఓటమి లేదు!

  • అద్భుత నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న సూర్యకుమార్
  • సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ వరుస విజయాలు
  • టీ20ల్లో టీమిండియాకు ఒక్క ఓటమి లేదు
Suryakumar Yadav Regret

Suryakumar Yadav Regret

భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు సూర్య నాయకత్వం వహించిన ఒక్క టీ20 సిరీస్ కూడా భారత్ ఓడిపోలేదు. ఈ గణాంకాలు సూరీడి కెప్టెన్సీ స్థాయి ఎలా ఉందో ఇట్టే తెలియజేస్తున్నాయి. టీ20ల్లో కెప్టెన్‌గా సూర్యకుమార్ అజేయ రికార్డు ఏంటో ఓసారి చూద్దాం.

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సిరీస్ ఫలితాలను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియాపై 4-1, మరోసారి కంగారో జట్టుపై 2-1తో టీమిండియా గెలుపొందింది. దక్షిణాఫ్రికాపై 1-1 డ్రా, ఆ తరువాత 3-1 విజయం అందుకుంది. అలాగే శ్రీలంకపై 3-0, బంగ్లాపై 3-0,ఇంగ్లండ్ జట్టుపై 4-1, న్యూజీలాండ్ పై 4-1 విజయాలు టీంఇండియా అందుకుంది. అంతేకాదు సూర్య నాయకత్వంలో భారత్ ఆసియా కప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది.

Also Read: Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?

ఇక ప్రపంచ వేదికపై కూడా సూర్యకుమార్ యాదవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అతని కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్‌ 2026లో దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. ఈ గణాంకాలతో సూర్యకుమార్ టీ20ల్లో ప్రపంచంలోనే అత్యధికంగా 81.81 విజయ శాతం కలిగిన కెప్టెన్‌గా నిలిచాడు. మొత్తంగా చూస్తే సూర్య నాయకత్వంలో టీమిండియా దూకుడైన ఆట, సాహసోపేతమైన నిర్ణయాలు, సమతుల్య జట్టు కాంబినేషన్‌తో ప్రత్యర్థులకు కఠిన సవాల్ విసురుతోంది. ఇదే ఫామ్ కొనసాగితే భవిష్యత్ టోర్నీల్లో కూడా భారత్ ఆధిపత్యం కొనసాగించడం ఖాయం.