NTV Telugu Site icon

Team India: సూర్యకుమార్‌ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడా?

Surya Kumar Yadav

Surya Kumar Yadav

Team India: టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం టీ20 క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. ఐసీసీ ర్యాంకుల్లోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. బంతి ఎటువైపు వేసినా సూర్యకుమార్ సిక్సర్లు దంచుతున్నాడు. వినూత్నమైన షాట్లతో అలరిస్తున్నాడు. అతడి స్ట్రైక్‌రేట్‌తో పాటు యావరేజ్ కూడా ఎక్కువగానే ఉంటోంది. టీ20 క్రికెట్ తరహాలో సూర్యకుమార్ వన్డేల్లోనూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిడిలార్డర్లో అతడికి అవకాశం ఇస్తారని అంటున్నారు.

Read Also: Raviteja: రవితేజ నోటి దూల.. ఆ డైరెక్టర్ ను కల్లు తాగిన కోతి అంటూ

అయితే టెస్ట్ క్రికెట్‌లో ప్రస్తుతం పోటీ బాగానే ఉంది. పుజారా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లతో మిడిలార్డర్ పటిష్టంగానే కనిపిస్తోంది. మరి సూర్యకుమార్ ఎంట్రీ ఇస్తే ఎక్కడ ఆడిస్తారు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే సూర్యకుమార్ టెస్ట్ క్రికెట్‌ ఎంట్రీకి ఇంకా సమయం ఉందని.. కోహ్లీ, పుజారాలలో ఒకరు తప్పుకున్న తర్వాతే సూర్యకుమార్ టెస్టు జట్టులోకి వస్తాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రంజీ ట్రోఫీలోనూ సూర్యకుమార్ అదరగొడుతున్నాడు. హైదరాబాద్ జట్టుపై 80 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 90 పరుగులు చేశాడు.

మరోవైపు వెస్టిండీస్‌తో 7 టీ20ల సిరీస్ నుంచి దూకుడు మొదలు పెట్టిన సూర్యకుమార్ యాదవ్.. టీ20 ప్రపంచకప్ వరకు తన ఫామ్ కొనసాగించాడు. ఆసియా కప్‌లోనూ అదరగొట్టాడు. ప్రతీ సిరీస్‌లో మెరిసిన సూర్య.. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది భారత క్రికెట్‌కు కలిసి రాకున్నా.. సూర్యకు మాత్రం బాగా కలిసొచ్చింది.