NTV Telugu Site icon

IPL 2023 : ఉప్పల్ లో హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్.. ఫ్యాన్స్ హంగామా

Uppal Staduim

Uppal Staduim

ఉప్పల్ క్రికెట్ స్టేడియం మరోసారి అభిమానులతో హోరెత్తనుంది. వరుసగా మూడు సీజన్లు టీవీల్లో, ఫోన్ లలో ఐపీఎల్ మ్యాచ్ లు చూసి సంతృప్తి చెందిన క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రత్యేక్షంగా మైదానంలో ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేటితో మొదలు పెట్టి మే 18వరకు ఏడు ఐపీఎల్ మ్యాచ్ లు స్టేడియంలో అలరించనున్నాయి. ఐపీఎల్ మ్యాచ్.. ఆపై ఆదివారం వేసవి వినోదాన్ని ఆస్వాందించేందుకు ఈ కాంబినేషన్ సరిగ్గా సరిపోతుంది.

Also Read : Costume Krishna: సీనియర్‌ నటుడు కాస్ట్యూమ్‌ కృష్ణ ఇకలేరు..

నేడు సొంత గడ్డపై సన్ రైజర్స్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగే పోరులో తలపడనుంది. ఈ రోజు మాత్రమే కాదు.. వచ్చే ఆదివారం కూడా హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ ఉండడంతో వరుసగా రెండు వారాంతాలు ఫ్యాన్స్ కు పండుగే.. సీజన్ లో తొలి మ్యాచ్ కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్ సీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన వేదికల్లో హైదరాబాద్ కూడా ఉంది. దాంతో అవుట్ ఫీల్డ్, పిచ్ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిష్టాత్మకంగా మ్యాచ్ లు జరపాలని హెచ్ సీఏ పట్టుదలగా ఉంది.

Also Read : IPL 2023 : ఐపీఎల్ లో రికార్డు సృష్టించిన ఉమేశ్ యాదవ్

ఐపీఎల్ లో వినోదం గురించి నగర అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా స్థానిక జట్టుకు పెద్ద సంఖ్యలో మద్దతు లభించడం ఖాయం. దాంతో మరోసారి మైదానం ఆరెంజ్ రంగుతో నిండిపోనుంది. ప్రస్తుతానికి ఇవాళ, వచ్చే ఆదివారం జరిగే రెండు మ్యాచ్ ల కోసమే సన్ రైజర్స్ టికెట్లను అందుబాటులో ఉంచింది. రెండు మ్యాచ్ లకు సంబంధించి తక్కువ విలువ ఉన్న టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయాయి. పేటీఎం, ఇన్ సైడర్ ద్వారా ఆన్ లైన్ లో టికెట్లు విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రూ. 1367 ఆపై ధర గత టికెట్లు లభిస్తున్నాయి. జింఖానా గ్రౌండ్ లో 24సెవెన్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ అవుట్ లెట్ లలో కూడా నేరుగా టికెట్లు కొనుక్కునే అవకాశం ఉంది.

Also Read : Love Fraud: నన్ను మోసం చేశాడు.. నడిరోడ్డుపై ప్రియురాలు రచ్చ మామూలుగా చేయలేదండోయ్‌

2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉప్పల్ స్టేడియంలో చివరిసారి మ్యాచ్ ఆడింది. పంజాబ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో రైజర్స్ 45 పరుగులతో గెలిచింది. సుధీర్ఘకాలం పాటు హైదరాబాద్ అభిమానులకు ఆత్మీయులుగా మారిపోయిన పలువురు క్రికెటర్లు ఈసారి ఆ జట్టులో లేరు. ముఖ్యంగా తన డ్యాన్స్ లు, తెలుగు టిక్ టాక్ పాటలతో మన అభిమానులకు దగ్గరైన డేవిడ్ వార్నర్, కేన్ మామా( విలియమ్సన్) వరుసగా మ్యాచ్ లు గెలిపించిన రషీద్ ఖాన్ కూడా ప్రత్యర్థి టీమ్ లోకి వెళ్లిపోయారు.

Also Read : Taliban : తాలిబన్ల అదుపులో ముగ్గురు బ్రిటన్‌ జాతీయులు

దీంతో ఈసారి జట్టు కాస్త కొత్తగా కనిపించనుంది. 2019లో సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను కూడా మన అభిమానులు ఆస్వాదించారు. చెన్నైతో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై 1 పరుగు తేడాతో గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. ఈసారి చెన్నై జట్టు హైదరాబాద్ లో ఆడడం లేదు. కాబట్టి చెన్నై సారథి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఆటను చూసే అవకాశం మన ప్రేక్షకులు కోల్పోయినట్లే.

Also Read : Top Headlines@9AM: టాప్‌ న్యూస్

ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లు.. ప్రత్యర్థి జట్లు

1. ఏప్రిల్‌ 2 – ప్రత్యర్థి జట్టు రాజస్తాన్‌ – మధ్యాహ్నం 3.30 గంటల నుంచి
2. ఏప్రిల్‌ 9 – పంజాబ్‌ – రాత్రి 7.30 గం. నుంచి
3. ఏప్రిల్‌ 18 – ముంబై – రా.7.30 గం. నుంచి
4. ఏప్రిల్‌ 24 – ఢిల్లీ – రా. 7.30 గం. నుంచి
5. మే 4 – కోల్‌కతా – రా. 7.30 గం.నుంచి
6. మే 13 – లక్నో – మ.3.30 గం. నుంచి
7. మే 18 – బెంగళూరు – రాత్రి 7:30 గంటల నుంచి

Show comments