Costume Krishna: సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ ఇకలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Costume Krishna: సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ ఇవాళ కన్నుమూశారు. చెన్నైలో అనారోగ్యంతో కాస్ట్యూమ్ కృష్ణ తుది శ్వాస విడిచారు. కాస్ట్యూమ్ కృష్ణ ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపు కోట. కాస్ట్యూమ్ కృష్ణ నటుడిగా తొలి సినిమా భారత్ బంద్ సినిమాలో నటుడిగా పరిచయం అయ్యారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తాత గా తండ్రిగా అనేక పాత్రల తో మెప్పించారు. నిర్మాతగా 8 సినిమాలు నిర్మించారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణ వార్త వినడానికి బాధగా ఉంది, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని దిల్ రాజు తెలిపారు.
Read also: Love Fraud: నన్ను మోసాడు.. రోడ్డుపై ప్రియురాలు రచ్చ మామూలుగా చేయలేదండోయ్
Also Read
- Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
- Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
- Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
- Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ నటుడు, కాస్ట్యూమ్స్ కృష్ణ అనతికాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నారు. రామానాయుడు సంస్థలో పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. లెక్కలేనన్ని సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి కథానాయికలకు కాస్ట్యూమ్స్ అందించి సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. అంతేకాకుండా.. ఆయన ఘట్టమనేని కృష్ణ హీరోగా అశ్వద్దామ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. దీంతో పెళ్లాం చెప్తే వినాలి, మా ఊరు మారాడు, పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అయితే అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో జేబులో కాసుల వర్షం కురిసింది.
అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో కాస్ట్యూమ్స్ కృష్ణకు పెళ్లిపందిరి సినిమా రూపంలో చేదు అనుభవం ఎదురైంది. పెళ్లిపందిరి సినిమాకు పబ్లిసిటీ అవసరం లేదని, సినిమా హిట్ కావాలంటే మౌత్ పబ్లిసిటీ సరిపోతుందని భావించిన కృష్ణ, సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు భయపడి ఈ విషయాన్ని చిత్ర హీరో జగపతిబాబుకు చెప్పాడట. కానీ పబ్లిసిటీ అవసరం లేదు సార్ అని కృష్ణ అన్నారు. కానీ కొందరు మాత్రం పబ్లిసిటీ కోసం 2 లక్షలు అప్పు ఇస్తాం.. సంతకం చేస్తే చాలు అంటూ ముందుకు వచ్చారు. జగపతిబాబు కూడా ఈ రుణానికి సంబంధించి ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో.. ఆయనను నమ్మి కృష్ణ రెండు సంతకాలు పెట్టాడు.
పెద్దగా చదువుకోని కృష్ణకు తమిళం, తెలుగు తప్ప వేరే భాష తెలియదు. దీంతో ఆయన సంతకం పెట్టిన మొదటి కాగితంలో “కాస్ట్యూమ్స్ కృష్ణకి బయ్యర్లు 2 లక్షలు అప్పు ఇచ్చినట్టు” ఉండగా, ఇక..మరో కాగితంలో “కాస్ట్యూమ్స్ కృష్ణ దగ్గర నుంచి పెళ్లిపందిరి సినిమాకి సంబంధించిన నెగిటివ్ రైట్స్ బయ్యర్లు కొన్నట్లు ఉంది. అయితే..ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న కృష్ణ తనని నమ్మకంలో మోసం చేశారని బాధపడ్డారట. అంతేకాకుండా.. సినిమాలపై విరక్తి పుట్టి చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. ఇక అప్పడే ఆయన చెన్నైలోని ఓ అపార్ట్మెంట్ లో సాధారణ జీవితం గడుపుతున్న ఆయన ఇవాళ చెన్నైలోనే తన నివాసంలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.
తాజావార్తలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్‌ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!