NTV Telugu Site icon

SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ అద్భుత విజయం

Sunrisers Won The Match

Sunrisers Won The Match

Sunrisers Hyderabad Won The Match By 9 Runs Against Delhi Capitals: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 198 పరుగుల భారీ లక్ష్యాన్ని డీసీ ఛేధించలేకపోయింది. 188 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. సన్‌రైజర్స్ 9 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నిజానికి.. మొదట్లో ఫిల్ సాల్ట్, మిచెల్ సాల్ట్ సృష్టించిన పరుగుల సునామీని చూసి.. డీసీ ఈ మ్యాచ్ గెలుపొందుతుందని అంతా అనుకున్నారు. కానీ.. వాళ్లిద్దరు ఔటైన తర్వాత మిగతా బ్యాటర్లు చేతులు ఎత్తేయడం, సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. ఎస్ఆచ్‌హెచ్‌ని ఈ విజయం వరించింది.

Oscar: ఆస్కార్ లో ఉత్తమ చిత్రంగా నిలవాలంటే ఎలా!?

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67), క్లాసెన్ (27 బంతుల్లో 53) అర్థశతకాలతో చెలరేగడం.. చివర్లో అబ్దుల్ సమద్ (21 బంతుల్లో 28), అకీల్ హొసేన్ (10 బంతుల్లో 16) తమవంతు కృషి అందించడంతో.. సన్‌రైజర్స్ అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే చాపచుట్టేసింది. డీసీకి మొదట్లోనే డేవిడ్ వార్నర్ వికెట్ రూపంలో భారీ షాక్ తగిలినా.. ఆ తర్వాత ఫిల్ సాల్ట్ (59), మిచెల్ మార్ష్ (69) మాత్రం ఊచకోత కోశారు. క్రీజులో ఉన్నంతసేపు వీళ్లిద్దరు ఎచ్ఆర్‌హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఎడాపెడా షాట్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. రెండో వికెట్‌కి వీళ్లిద్దరు ఏకంగా 112 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీళ్లిద్దరు ఆడిన అద్భుత ఇన్నింగ్స్ కారణంగా.. డీసీ స్కోరు లక్ష్యం దిశగా దూసుకెళ్లింది.

Remote Places: ప్రపంచంలోని 10 అత్యంత మారుమూల ప్రాంతాలు

కానీ.. వాళ్లిద్దరు ఎప్పుడైతే ఔట్ అయ్యారో, అప్పటి నుంచి డీసీ పతనం మొదలైంది. మనీష్ పాండే ఒక్క పరుగే చేసి ఔట్ అవ్వగా.. అతని వెంటే ప్రియమ్ గార్గ్ (12) కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అతడు 9 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ (14 బంతుల్లో 29) తన జట్టుని గెలిపించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నించాడు కానీ.. అప్పటికే ఆలస్యమైపోయింది. చివరి ఓవర్‌లో 28 పరుగులు చేయాల్సి ఉండగా.. డీసీ బ్యాటర్లు 18 పరుగులు చేశారు. దీంతో.. 9 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో మార్కండే 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, హొసేన్, నటరాజన్, అభిషేక్ శర్మ తలా వికెట్ పడగొట్టారు.

Show comments