Site icon NTV Telugu

MI vs SRH: కష్టాల్లో సన్‌రైజర్స్.. 10 ఓవర్లలో పరిస్థితి ఇది!

Sunrisers 10 Overs Match

Sunrisers 10 Overs Match

Sunrisers Hyderabad Scored 76 Runs In First 10 Overs Against MI: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అతికష్టం మీద లక్ష్యం దిశగా సాగుతోంది. తొలి 10 ఓవర్లలో ఈ జట్టు 4 వికెట్ల నష్టానికి కేవలం 76 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో ఇంకా 117 పరుగులు చేయాల్సి ఉంటుంది. మొదటి నుంచి ముంబై ఇండియన్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటంతో.. సన్‌రైజర్స్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోతున్నారు. దీనికితోడు అనవసరమైన షాట్ల జోలికి వెళ్లి, వికెట్లు సమర్పించుకుంటున్నారు. మొదట్లోనే హైదరాబాద్ జట్టుకి హ్యారీ బ్రూక్ వికెట్ రూపంలో భారీ ఝలక్ తగిలింది. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అతగాడు.. ఈసారి కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడి, భారీ ఛేజింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాడని అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా అతగాడు కేవలం 9 వ్యక్తిగత పరుగులకే పెవిలియన్ చేరాడు.

Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల.. మే 2న సుప్రీంకోర్టు విచారణ

ఇక ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అతడు కూడా 7 పరుగులే చేసి, పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం మార్ర్కమ్ వచ్చాక హైదరాబాద్ జట్టులో కాస్త జోష్ వచ్చింది. భారీ ఇన్నింగ్స్ ఆడలేదు కానీ, ఉన్నంతసేపు హైదరాబాద్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేశాడు. ఇక క్రీజులో కుదురుకున్నాడని ఆలోచించేలోపే.. అతడు కూడా ఔటయ్యాడు. మొదట్లో హ్యారీతో కలిసి ఓపెనింగ్ చేసిన మయాంక్ అగర్వాల్ ఒక్కడే, ఆచితూచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు కూడా! అయితే.. హైదరాబాద్ లక్ష్యానికి చాలా దూరంలో ఉంది. దాన్ని ఛేజ్ చేయాలంటే.. భారీ షాట్లతో చెలరేగి ఆడాలి. కానీ.. ఆ స్థాయి ఆటగాళ్లు ఇప్పుడు కరువయ్యారు. మరి.. ఉన్న ఆటగాళ్లు ఎలా లాక్కొస్తారో చూడాలి.

Exit mobile version