Site icon NTV Telugu

IPL2023 : సన్ రైజర్స్ బ్యాటింగ్ అదుర్స్.. 10 ఓవర్లకు స్కోర్..?

Srh

Srh

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ తీసుకుంది. అయితే సన్ రైజర్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. దీంతో ఎస్ ఆర్ హెచ్ ఓపెనింగ్ బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు. బ్యాట్ ను ఝాలిపించడంతో కేవలం 10 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది.

Also Read : G20: కాశ్మీర్‌లో జీ 20 సమావేశం.. 26/11 తరహా టెర్రర్ అటాక్స్‌కి కుట్ర.. పాకిస్తాన్ పన్నాగం

అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు వికెట్ ఇవ్వకుండా ఆడ‌పాద‌డ‌పా బౌండ‌రీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఈ మ్యాచ్ లో వివ్రాంత్ శర్మ ( 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్ తో 67 పరుగులు ) అర్థ సెంచరీతో చెలరేగాడు. దీంతో ముంబై ఇండియన్స్ బౌలర్ల వికెట్ తీసేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ బౌలర్లను మార్చిన ఫలితం మాత్రం రాలేదు.

Also Read : Nayanthara: నయనతార మల్టీప్లెక్స్.. ఎక్కడో తెలుసా..?

మరో ఎండ్ లో మాయంక్ అగర్వాల్ ( 32 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సుతో 52 పరుగులు ) అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ముంబై బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు ఆడే చివ‌రి లీగ్ మ్యాచ్ ఇదే. ప్లే ఆఫ్స్ లో చోటు ద‌క్కించుకోవాలంటే ముంబై భారీ తేడాతో ఈ మ్యాచ్ లో విజ‌యం సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో ఒత్తిడి అంతా ముంబై ఇండియన్స్ టీమ్ పైనే ఉంటుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 130 పరుగులు చేసింది. క్రీజులో వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు ఉన్నారు.

Exit mobile version