Sunil Narine History: ఐపీఎల్‌లో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ రేర్ రికార్డు!
- ఐపీఎల్‌లో సునీల్ నరైన్ రేర్ రికార్డు
- అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ఆటగాడిగా రికార్డు
- 190వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Narine Creates IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ఆటగాడిగా నరైన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2026లో ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగడంతో ఈ రికార్డు నెలకొల్పాడు. ఇది నరైన్‌కు 190వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. అన్ని మ్యాచ్‌లను కేకేఆర్ తరఫునే ఆడడం విశేషం.
సునీల్ నరైన్ తన సహచర వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ రికార్డును అధిగమించాడు. పోలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున 189 మ్యాచ్‌లు ఆడగా.. నరైన్ ఇప్పుడు 190 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ (184 – ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), డేవిడ్ వార్నర్ (184 – ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్), డ్వేన్ బ్రావో (161 – చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
సునీల్ నరైన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 2012 వేలంలో రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లోనే జట్టుకు టైటిల్ అందించిన నరైన్.. ఆ తర్వాత కూడా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచాడు. ప్రారంభంలో మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన నరైన్.. కాలక్రమేణా అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా మారాడు. బౌలింగ్‌లో ఇప్పటివరకు 187 ఇన్నింగ్స్‌లలో 192 వికెట్లు తీశాడు. ఇందులో ఏడు సార్లు నాలుగు వికెట్లు, ఒకసారి ఐదు వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లో 122 ఇన్నింగ్స్‌లలో 1780 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. 2024 సీజన్ నరైన్‌కు ప్రత్యేకంగా నిలిచింది. ఆ సీజన్‌లో 488 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. ఈ ప్రదర్శనతో అతడిని 2025 వేలానికి ముందు కేకేఆర్ రూ. 12 కోట్లకు రిటైన్ చేసింది. అయితే 2025 సీజన్‌లో 12 మ్యాచ్‌లలో 12 వికెట్లు మాత్రమే తీసి, బ్యాటింగ్‌లో 246 పరుగులు మాత్రమే చేశాడు.
ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్ల అత్యధిక మ్యాచ్‌లు:
190 – సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
189 – కీరన్ పోలార్డ్ (ముంబై ఇండియన్స్)
184 – ఏబీ డివిలియర్స్ (ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
184 – డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్)
161 – డ్వేన్ బ్రావో (చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్)
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!