Sunil Gavaskar Says MS Dhoni Is Not Captain Cool: కెప్టెన్ కూల్ ఎవరని ప్రశ్నిస్తే.. చిన్న పిల్లలు సైతం ఠక్కున టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్తారు. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నా, ఆటగాళ్లు ఏదైనా తప్పు చేసినా.. అతడు ఆవేశం కోల్పోడు. టెన్షన్‌గా కూడా కనిపించడు. చాలా కూల్‌గా పరిస్థితుల్ని హ్యాండిల్ చేస్తాడు. ఇలా తన కూల్ కెప్టెన్సీతోనే.. అతడు భారత జట్టుకి ఎన్నో మరుపురాని విజయాల్ని అందించాడు. అతనికి కోటానుకోట్ల అభిమానులు ఉండానికి కారణం.. అతని కూల్ కెప్టెన్సీనే కారణం.
Suraj Kumar: ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో కాలు తీసేసిన వైద్యులు
అయితే.. లిటిల్ మాస్టర్‌గా పేరొందిన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం ధోనీ ‘కెప్టెన్ కూల్’ కాదంటూ కుండబద్దలు కొట్టాడు. భారత్‌కు తొలి వరల్డ్‌కప్‌ను అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసలైన ‘కెప్టెన్ కూల్’ అని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 25వ తేదీ నాటికి 1983 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని 40 ఏళ్లు పూరైన సందర్భంగా.. గవాస్కర్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన.. తన దృష్టిలో కెప్టెన్ కూల్ ధోనీ కాదని, ఒరిజినల్ కెప్టెన్ కూల్ కపిల్ దేవ్ అని పేర్కొన్నాడు. కపిల్ దేవ్ ఒక డైనమిక్ లీడర్ అని, కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ అతనిలో పుష్కలంగా ఉండేవని కొనియాడాడు.
Virat Kohli: కోహ్లీ స్థానానికి ఎసరుపెట్టిన సీనియర్ ప్లేయర్.. ఎవరో తెలుసా?
‘‘1983 వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ను సూపర్బ్‌గా అందుకున్నాడు. అదే మ్యాచ్ మలుపు తిప్పింది. మేము వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచేలా చేసింది. ఆ క్యాచ్ ఇప్పటికీ ఎవరూ మరిచిపోరు. అంతేకాదు.. కపిల్ దేవ్ చాలా కూల్‌గా ఉండేవాడు. ఒక ప్లేయర్ క్యాచ్ వదిలినా, మిస్ ఫీల్డ్ చేసినా.. కపిల్ ముఖంపై చిరునవ్వు తప్ప కోపం కనిపించేది కాదు. నా దృష్టిలో కపిల్ అసలైన కెప్టెన్ కూల్’’ అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా.. 1983 ప్రపంచకప్‌లో అండర్ డగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్లో విండీస్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.