NTV Telugu Site icon

Sunil Gavaskar: 75 ఏళ్ల వయసులో చిన్న పిల్లాడిలా డ్యాన్స్.. టీం ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న క్రికెట్ దిగ్గజం

Sunil Gavaskar

Sunil Gavaskar

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ కైవస చేసుకుంది. దీంతో టీమిండియా రికార్డు స్థాయిలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా విజయం సాధించిన తర్వాత, స్టేడియం లోపల, వెలుపల సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ ఫ్యాన్స్ ర్యాలీలు తీస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజాలు కూడా సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు. వీరిలో భారత క్రికెట్ దిగ్గజం, టీం ఇండియా మాజీ లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 75 ఏళ్ల వయసులో చిన్న పిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ టీం ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.

Also Read:Keerthi Suresh : ఆ సినిమాలో చాలా భయపడుతూ నటించాను..

టీం ఇండియా విజయంతో సునీల్ గవాస్కర్ చాలా సంతోషంగా కనిపించాడు. టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను లిఫ్ట్ చేస్తున్నప్పుడు, సునీల్ గవాస్కర్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్న పిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ గ్రౌండ్ లో హోరెత్తించాడు. మ్యాచ్ తర్వాత మైదానంలో కామెంట్రీ చేస్తూ గవాస్కర్ ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆటగాళ్లపై అతని కఠినమైన విమర్శలను ఇప్పుడు మనం అర్థం చేసుకోగలమని నేను అనుకుంటున్నాను అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.

Also Read:Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ.. కీలక ప్రకటన

ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, టీం ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీం ఇండియా 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు తన మూడవ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. టీం ఇండియా మొదట 2002 లో, తరువాత 2013 లో, ఇప్పుడు 2025 లో ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది కాకుండా టీం ఇండియా 2000, 2017 సంవత్సరాల్లో ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా కూడా నిలిచింది.