IND vs WI: బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలపై గవాస్కర్ అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌లో టీమిండియా చేసిన ప్రయోగాలపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌కు పంపించి… వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపడం సరికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు చాలా మంది ఓపెనర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో పంత్‌ను ఓపెనింగ్‌కు పంపించి ప్రయోగం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. రోహిత్‌తో పంత్‌ను ఓపెనింగ్ పంపడం చివరి ఆప్షన్‌గానే ఉండాలన్నాడు. ఒకవేళ ధాటిగా ఆడే ఎడమచేతి వాటం ఓపెనర్ కావాలనుకుంటే ఇషాన్ కిషన్‌ను తీసుకుంటే సరిపోయేదన్నాడు.
Read Also: IND vs WI 2nd ODI: మ్యాచ్ మనదే.. సిరీస్ కూడా మనకే
Also Read
- Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
- ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
అటు కరోనాతో బాధపడుతున్న రుతురాజ్ గైక్వాడ్ కోలుకుంటే ఓపెనింగ్ స్థానంలో అతడు మంచి ఆప్షన్ అవుతాడని సన్నీ తెలిపాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫుడన ఆడిన అతడు… గత కొన్ని సీజన్‌లలో అద్భుతంగా ఆడాడని, దురదృష్టవశాత్తూ కరోనా వల్ల ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడని వివరించాడు. కాగా రెండో వన్డేలో రోహిత్, పంత్ ఓపెనింగ్‌కు దిగగా ఇద్దరూ విఫలమయ్యారు. కానీ మిడిలార్డర్‌లో దిగిన కేఎల్ రాహుల్ మాత్రం రాణించాడు. అదే అతడు ఓపెనర్‌గా ఆడుంటే టీమిండియా మరింత మెరుగైన స్కోరు చేసేదని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
-
Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!