Site icon NTV Telugu

Steve Smith: టీమిండియా చేతిలో ఘోర ఓటమి.. వన్డేలకు గుడ్ బై చెప్పిన ఆసీస్ కెప్టెన్..

Smith

Smith

Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నాడు. వ‌న్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 సెమీ ఫైన‌ల్లో భార‌త్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్మిత్ తన నిర్ణయం ప్రకటించాడు. అయితే, 170 వన్డేల్లో 5,800 పరుగులు చేసిన స్మిత్.. 12 సెంచరీలు.. 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో ఆసీస్ కెప్టెన్ స్మిత్ అత్యధిక స్కోర్ 164 పరుగులు.

Read Also: Vemula Veeresam: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్.. భారీగా డబ్బులు డిమాండ్

అయితే, 2016లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 164 పరుగులు చేశారు. వన్డేల్లో 28 వికెట్లు తీసిన స్మిత్.. తన ఖాతాలో 90 క్యాచ్ లు ఉన్నాయి. స్మిత్ కెప్టెన్సీలో 64 మ్యాచ్ లు ఆడగా.. వాటిలో 32 విజయాలు, 28 ఓటములు.. మరో నాలుగు మ్యాచ్ లు ఫలితం తేలలేదు. కాగా, తాను ఇక నుంచి టీ20లు, టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతానని స్మిత్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version