Site icon NTV Telugu

IND Vs SL: తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌లకు దక్కని చోటు

Team India

Team India

IND Vs SL: గౌహతి వేదికగా టీమిండియాతో జరగనున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. తుది జట్టులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లను తీసుకోలేదు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకోగా.. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం కల్పించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ రానున్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో బరిలోకి దిగనున్నారు. అక్షర్ పటేల్, చాహల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు.

Read Also: Corona : దేశంలో 4.46కోట్లకు చేరిన కరోనా బాధితులు

టీమిండియా తుది జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, చాహల్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
శ్రీలంక తుది జట్టు: కుశాల్ మెండిస్, పాథుమ్ నిశాంక, అవిష్క ఫెర్నాండో, ధనుంజయ డిసిల్వ, చరిత్ అసలంక, దాసున్ షనాక, హసరంగ, కరుణరత్నె, వెల్లాగే, రజిత, మధుశంక

Exit mobile version