Site icon NTV Telugu

T20 World Cup: మెగా టోర్నీ నుంచి ఆప్ఘనిస్తాన్ అవుట్.. శ్రీలంక ఆశలు సజీవం

Hasaranga

Hasaranga

T20 World Cup: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌లో శ్రీలంక తన సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మంగళవారం ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. గుర్బాజ్ 28, ఘని 27, ఇబ్రహీం 22 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు తీయగా లహిరు కుమార 2 వికెట్లు సాధించాడు. రజిత, ధనుంజయ డిసిల్వ తలో వికెట్ తీశారు.

Read Also: ఇండియాలో ఘోరమైన వంతెన ప్రమాదాలు ఇవే…

కాగా ఆప్ఘనిస్తాన్ విధించిన 145 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 18.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ధనంజయ డిసిల్వా 42 బంతుల్లో 66 నాటౌట్‌గా నిలిచి తన జట్టుకు విజయం అందించాడు. ఓపెనర్ కుశాల్ మెండిస్ 25 పరుగులు చేశాడు. ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు సాధించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హసరంగను వరించింది. తాజాగా శ్రీలంక చేతిలో ఓటమితో అఫ్గానిస్తాన్ సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. కాగా గ్రూప్-1లో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. గ్రూప్-1లో ఆరు జట్లు ఉండగా 4 మ్యాచుల్లో ఆప్ఘనిస్తాన్ జట్టుకు 2 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఆ టీంను దురదృష్టం కూడా వెంటాడింది. రెండు మ్యాచులు వర్షంతో రద్దయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్ సెమీస్ రేసులో కీలకంగా మారనుంది.

Exit mobile version