గుజరాత్ మోర్బీ వంతెన
ఈ ఘటనలో 140 మందికి పైగా ప్రజలు మరణించారు.
ముంబై ఫుట్ బ్రిడ్జ్
2019లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మరణిస్తే .. 29 మంది గాయపడ్డారు.
వారణాసి ఫ్లై ఓవర్..
2018లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు.
పనాజీ బ్రిడ్జ్
గోవాలో 2017 సాన్‌వోర్డెమ్ నదిపై వంతెన కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
మజెర్హాట్ వంతెన
2018లో కోల్‌కతాలో ఈ ప్రమాదం జరిగింది. దీంట్లో ముగ్గురు మరణించగా.. 30 మంది గాయపడ్డారు.
ముంబై-గోవా హైవే బ్రిడ్జ్
2016లో రాయ్ గఢ్ జిల్లాలో సావిత్రి నదిపై వంతెన కూలి 40 మంది మరణించారు.
కోల్‌కతా ఫ్లై ఓవర్
కోల్‌కతా గిరీష్ పార్క్ వద్ద 2016లో జరిగిన ప్రమాదంలో 27 మంది మరణించగా.. 70 మంది గాయపడ్డారు.
హైదరాబాద్ ఫ్లై ఓవర్
2007లో పంజాగుట్ట వద్ద ఫ్లై ఓవర్ కూలిపోవడంతో 15 మంది మరణించారు.
రఫిగాంగ్ వంతెన
బీహర్ ధావే నదిపై వంతెన కూలి కోల్‌కతా-న్యూఢిల్లీ రైలు రెండు బోగీలు ముగినిపోయి 80 మంది మరణించగా.. 170 మంది గాయపడ్డారు.
కదలుండి నది వంతెన
2001 మంగళూర్-చెన్నై ప్యాసింజర్ రైలు కదలుండి నదిలో పడిపోయి 60 మంది మరణించారు.