T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
- మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సంచలనం
- శ్రీలంక చరిత్రాత్మక విజయం
- డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka Women scripted history in T20 World Cup 2026: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక మహిళల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ మహిళల జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో శ్రీలంక టోర్నీలో కీలక అడుగు వేయగా.. న్యూజిలాండ్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసి సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఆదుకున్న మెలీ కేర్, సోఫీ డివైన్:
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కెప్టెన్ మెలీ కేర్ 45 పరుగులు చేయగా.. సోఫీ డివైన్ 45 పరుగులతో జట్టుకు పోరాడే స్కోరు అందించింది. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హారి రెండు వికెట్లు పడగొట్టగా.. చమరి అతపత్తు, మిథాలి రాజపక్స, సుగంధిక కుమారి, నిమిష మధుషాని తలో వికెట్ తీశారు.
Also Read
- Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
- Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
- Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
- Jacob Duffy: కోహ్లీకి బౌలింగ్ చేయడం విసుగు తెప్పించింది.. ఆర్సీబీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నీలాక్షిక అద్భుత ఇన్నింగ్స్:
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ బౌలర్ నెన్సీ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 23 పరుగులకే 2 వికెట్లు పడగొట్టింది. దీంతో శ్రీలంక 8.3 ఓవర్లలో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో నీలాక్షిక డి సిల్వా అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. 37 బంతుల్లో 54 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచింది. నీలాక్షిక ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. కవీషా దిల్హారి (17), కౌషిని నూత్యాంగన (24 నాటౌట్) కీలక పరుగులు చేశారు.
శ్రీలంకకు తొలి విజయం:
చివరి వరకు ఒత్తిడిని తట్టుకున్న నీలాక్షిక డి సిల్వా, కౌషిని జోడీ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయ తీరాలకు చేర్చింది. శ్రీలంక 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై శ్రీలంకకు తొలి విజయం దక్కింది. మరోవైపు వెస్టిండీస్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిన న్యూజిలాండ్.. ఇప్పుడు శ్రీలంక చేతిలో కూడా పరాజయం పాలవడంతో సెమీఫైనల్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. శ్రీలంక మాత్రం ఈ గెలుపుతో గ్రూప్-బి పోటీలో తన ఆశలను సజీవంగా ఉంచుకుంది.
𝐖𝐇𝐀𝐓 𝐈𝐓 𝐌𝐄𝐀𝐍𝐒! 💙💛
Jubilation for Sri Lanka as they register a historic first-ever Women’s #T20WorldCup win over New Zealand 🤩📸 pic.twitter.com/gXHXhO2qjI
— ICC (@ICC) June 16, 2026
తాజావార్తలు
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Today Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఏ రాశి వారికి ధనలాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!