NTV Telugu Site icon

కరోనా కలకలం.. ఐసోలేషన్‌లో క్రికెటర్లు.. మ్యాచ్‌ ఇవాళ్టికి వాయిదా

India

India

శ్రీలంక టూర్‌లో కరోనా కలకలం రేపుతోంది. భారత ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో… నిన్న భారత్ – శ్రీలంక మధ్య జరగాల్సిన రెండో టీ-20 వాయిదా పడింది. దీంతో ఇరు జట్లు ఐసోలేషన్‌కి వెళ్లాయి. టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లకు అందరికీ కోవిడ్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగటివ్‌గా తేలితేనే.. ఇవాళ్టి మ్యాచ్‌ సజావుగా సాగే అవకాశం ఉంది. కృనాల్‌కు సన్నిహితంగా ఉన్న మరో 8 మంది ప్లేయర్లకు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయగా.. వారందరికి నెగిటీవ్‌ వచ్చినట్లు తేలిందని బీసీసీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లంతా బయో బబుల్‌లోనే ఉంటున్నారు. అయినా కృనాల్‌కు పాజిటివ్‌ ఎలా వచ్చిందో స్పష్టత లేదు.

విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే శుభ్‌మన్‌ గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అవేశ్‌ ఖాన్‌ వంటి యువ ప్లేయర్లు గాయాల బారిన పడటంతో.. శ్రీలంక పర్యటనలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌, పృథ్వీ షాకు.. టెస్టు సిరీస్‌లో ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం వీరితో పాటు లంక టూర్‌లో ఉన్న కృనాల్‌కు కరోనా సోకడంతో ఇంగ్లండ్‌కు వెళ్లే అంశంపై సందిగ్దత నెలకొంది. ఇంగ్లాండ్‌లో ఇప్పటికే రిషభ్‌ పంత్‌ కరోనా బారిన పడి కోలుకున్నాడు. అతడితో సన్నిహితంగా మెలిగిన వృద్ధిమాన్‌ సాహా, భరత్‌ అరుణ్‌, అభిమన్యు ఈశ్వరన్‌ పది రోజులు ఐసోలేషన్‌లో ఉన్నారు.