NTV Telugu Site icon

IND vs SL 3rd ODI: క్లీన్ స్వీప్.. లంక బ్యాటర్లు చిత్తు.. భారత్ ఘనవిజయం

India Wom Match

India Wom Match

Sri Lanka All Out For 73 Against India In 3rd ODI: గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ కుదిర్చిన 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 73 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ఏకంగా 317 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక టపీటపీమంటూ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. ఏ ఒక్కరూ కూడా పోరాటపటిమ కనబర్చలేదు. బ్యాటర్లందరూ వచ్చినట్టే వచ్చి పెవిలియన్ బాట పట్టారు. నువానిదు ఫెర్నాండో 19 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడంటే.. లంక బ్యాటర్లు ఎంత పేలవ ప్రదర్శన కనబరిచారో మీరే అర్థం చేసుకోండి.

Marriage: వివాహంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అదెలాగా అంటారా!

తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంపిక చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (116), విరాట్ కోహ్లీ (166) శతకాలతో చెలరేగడంతో.. భారత్ తన స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అంతకుముందు ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ (42) సైతం శుబ్మన్‌తో కలిసి శుభారంభాన్ని అందించాడు. రోహిత్ ఔటయ్యాక బరిలోకి దిగిన కోహ్లీ.. శుబ్మన్‌తో కలిసి లంక బౌలర్లతో ఓ ఆటాడుకున్నారు. వీళ్లిద్దరు కలిసి రెండో వికెట్‌కి ఏకంగా 131 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. శుబ్మన్ ఔటయ్యాక శ్రేయస్‌తో కలిసి కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. సెంచరీ చేసుకున్నాక.. లంక బౌలర్లపై తాండవం చేశాడు. దీంతో.. అప్పటివరకు నత్తనడకన నడిచిన భారత్ స్కోర్ బోర్డు, ఆ తర్వాతి నుంచి తారాజువ్వలా దూసుకెళ్లింది.

GVL Narasimha Rao: వందే భారత్.. విప్లవాత్మక మార్పుకు నాంది

అనంతరం 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. పూర్తిగా చేతులెత్తేసింది. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. అందులో నలుగురు బ్యాటర్లు ఒక్క పరుగుకే ఔటయ్యారు. లంక బ్యాటర్లకు ఆడేందుకు భారత బౌలర్లు ఆస్కారం ఇవ్వకపోవడంతో.. 73 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. తన ఓవర్ల కోటా పూర్తి చేసుకున్న అతడు.. 32 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ 3-0తో సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది.

Libraries : తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు