Site icon NTV Telugu

IPL2023 : మేం సరికొత్త టీమ్ తో వస్తున్నాం.. భువనేశ్వర్

Bhuvaneshwar Kumar

Bhuvaneshwar Kumar

ఐపీఎల్ 2023లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాబాద్ టీమ్ తమ తొలి మ్యాచ్ ను సొంత గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్ కు టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించనున్నాడు. అలాగే యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఆల్ రౌండన్ సుందర్, బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడే హ్యారి బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్ తో పటిష్టమైన బ్యాటింగ్ ఉందని కొత్త కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ అన్నారు.

Also Read : MP Santhosh Kumar: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో వినూత్న అవార్డు

సరికొత్త టీమ్ తో ఈ సీజన్ లో అడుగుపెడుతున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ అన్నారు. మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది కెప్టెన్ ల విషయంలో ప్రతీ సీజన్ లో కొంత తడబాటు ఉండేది.. ఈసారి మార్క్రమ్ కెప్టెన్సీ తో SRHకి అదనపు బలం వచ్చింది.. యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ , నటరాజన్ మా బౌలింగ్ స్ట్రేంత్ పెరిగిందని భువనేశ్వర్ కుమార్ అన్నారు. అలాగే హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌లో SRH జట్టుతో తలపడేందు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా సిద్ధమైంది. యువ ప్లేయర్ సంజు శాంసన్ సారధ్యంలో బెస్ట్ బ్యాటింగ్, బౌలింగ్ టీమ్‌తో రానుంది. ఈ క్రమంలో జరిగే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి గట్టీ ఆదరణ ఉందనే చెప్పుకోవాలి. కాగా ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో జరిగే నాలుగో మ్యాచ్ ఆదివారం కావడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

Also Read : KTR: దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్

SRH : అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్ (WK), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్( కెప్టెన్), అకేల్ హుసేన్, ఉమ్రాన్ మాలిక్, T నటరాజన్.
RR : జోస్ బట్లర్ (WK), యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (సి), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్‌మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్.

Exit mobile version