NTV Telugu Site icon

INDvsNZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రవీంద్ర జడేజా రిటైర్?

Jadeja

Jadeja

భారత్-న్యూజీలాండ్ మధ్య ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇరుజట్లు భీకరంగా పోరాడుతున్నాయి. అయితే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ వేళ రవీంద్ర జడేజా రిటైర్ మెంట్ పై ఊహాగానాలు వెల్లువెత్తాయి. జడేజా రిటైర్ అవుతున్నారా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. జడేజా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి జడేజా ఆడే చివరి వన్డే మ్యాచ్ కావచ్చని ఊహాగానాలు వచ్చాయి.

Also Read:Health Tips: రక్తహీనతతో బాధపడుతున్నారా? ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోండి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను 10 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. జడేజా కివీస్ ప్లేయర్ టామ్ లాథమ్ వికెట్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, విరాట్ కోహ్లీ జడేజా వద్దకు పరిగెత్తి అతన్ని కౌగిలించుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జడేజా తన చివరి మ్యాచ్ ఆడాడని, ఫైనల్ తర్వాత అతను వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అభిమానులు ఊహిస్తున్నారు. అభిమానులు ఇది జడేజా రిటైర్మెంట్ కు సంకేతం కావచ్చని భావిస్తున్నారు.

Also Read:IND vs NZ: అదరగొట్టిన స్పిన్నర్స్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

సెమీఫైనల్ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ను కోహ్లీ కౌగిలించుకున్న ఫోటోలను కూడా కొందరు షేర్ చేస్తున్నారు. ఆ మ్యాచ్ తర్వాత స్మిత్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా జడేజా టీమిండియా విజయవంతమైన ఆల్ రౌండర్లలో ఒకరు. అతని స్పిన్, బ్యాటింగ్ భారత్ కు అనేక మ్యా్చ్ లను గెలిపించాయి. జడేజా భారత్ తరపున 204 వన్డేలు ఆడి 2797 పరుగులు చేశాడు. అందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జడేజా వన్డేల్లో మొత్తం 231 వికెట్లు పడగొట్టాడు.