Site icon NTV Telugu

రూ.12 వేల డ్రెస్‌…లక్ష రూపాయల బ్యాగ్‌.!

ఆమె బాలివుడ్‌ సూపర్‌ స్టార్‌…ఆయన క్రికెట్‌ సూపర్‌ స్టార్‌.. కాంబినేషన్‌ అదిరింది కదా. అనుష్క, కోహ్లీ ఎప్పుడూ సోషల్‌ మీడియా డార్లింగ్సే. ఈ స్టార్‌ కపుల్‌ ఎక్కడికి వెళ్లినా ..ఏం చేసినా అది న్యూసే. అవును మరి వారి చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ప్రస్తుతం ఈ జంట తమ కూతురుతో కలిసి ఇంగ్లండ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంగ్లండ్‌ వీధులన్నీ తమవే అన్న లెవెల్‌లో విహరిస్తున్నారు. లంచ్‌ డేట్లతో జాలీగా గడుపుతున్నారు.

అనుష్క ప్రస్తుతం జిలుగు వెలుగుల బాలీవుడ్‌కు దూరంగా ఉంది. కానీ అంతకన్నా ఎక్కువ జిగేల్ మనిపించే జీవితాన్నే ఎంజాయ్‌ చేస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనలో ఉంది. భర్తకు తోడుగా ఆమె కూడా టూర్‌లో ఉంది. దాదాపు ప్రతి రోజు ఈ జంట గురించి ఏదో ఒక న్యూస్‌ ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేస్తూనే ఉంది. వీరికి సంబంధించిన ఏదో ఒక విశేషం వైరలవుతోంది. అనుష్క శర్మ ఇన్‌స్టాలో వెరీ యాక్టివ్‌. విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. నిజమే మరి..బెలూన్‌ స్లీవ్స్‌తో డిజైన్‌ చేసిన ఈ ఓవర్‌సైజ్‌ వైట్‌ మ్యాక్సీ ఖరీదు 12 వేల రూపాయల పైమాటే.

కొద్ది రోజుల క్రితం వారు వెగాన్‌ కేఫ్‌లో లంచ్‌ చేశారు. ఆ సందర్భంగా రెస్టారెంట్‌ చెఫ్‌ వారితో కలిసి ఫొటోలు దిగాడు. తరువాత అతడు వాటిని వాటిని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. అంతే అవి వైరల్. ఆ ఫొటోలో అనుష్క చేతిలో ఉన్న బ్యాగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఓ లగ్జరీ బ్రాండ్‌ డిజైనర్‌ బ్యాగ్‌. దాని ఖరీదు 1,390 డాలర్లు. మన రూపాయల్లో అయితే అక్షరాల లక్షా మూడు వేల రెండు వందల ముప్పయ్‌ అయిదు రూపాయలు. అనుష్క అంటే అదే మరి!!

కోహ్లీ కూడా తక్కువ తిన లేదు. అనుష్క కన్నా నాలుగాకులు ఎక్కువే చదివాడు. ఆయన తాగే వాటర్‌ బాటిల్‌ ఖరీదు ఎంతో తెలిస్తే మనం కళ్లు తేలేయాల్సిందే. దాని పేరు బ్లాక్‌ వాటర్‌. లీటర్‌ మూడు నుంచి నాలుగు వేలు. సహజసిద్ధమైన ఆల్కలైన్‌ వాటర్‌ అట అది. ఆ నీళ్లు తాగితే డీహైడ్రేషన్‌ ఛాన్సే లేదు.. ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుందని కోహ్లీ అంత ఖరీదైన నీళ్లు తాగుతున్నాడు.

కోహ్లీ చేతికి కనిపించే రోలెక్స్‌ వాచ్‌ ఖరీదు 87 కేవలం లక్షలే. ఆయన ఉపయోగించే బెంట్లే కాంటినెంటల్‌ కారు ధర దాదాపు నాలుగున్నర కోట్లు. ఇది గాక ఆయన గ్యారేజ్ లో ఆడిQ8 కూడా ఉంది..దాని ధర దాదాపు కోటిన్నర. ఇక ఆయన ఉండే ఇల్లు 80 కోట్లు. హర్యానాలో గుర్గావ్‌లో ఉందీ బంగళా. 2020 లాక్‌డౌన్‌ కాలమంతా ఈ ఖరీదైన ఇంట్లోనే గడిపింది.

కోహ్లీ ఆదాయం కూడా ఆ రేంజ్‌లోనే ఉంది మరి. బీసీసీఐ ఏటా 7 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. ఐపీఎల్ ద్వారా ఏడాదికి 17 కోట్లు ముడుతుంది. అలా ఐపీఎల్‌ ద్వరా ఇప్పటి వరకు 140 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇవి కాకుండా బ్రాండింగ్‌ కాంట్రాక్ట్‌ల ద్వారా నెలకు దాదాపు 10 కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నెట్‌ వర్త్ 980 కోట్ల రూపాయలు. ఇంతలా సంపాదిస్తున్నాడు కాబట్టే అంతలా ఖర్చు చేస్తున్నాడు.

విరాట్‌ కోహ్లీ లగ్జరీ లైఫ్‌ బాగానే ఉంది కానీ…ఆయన ఆట తీరే ఇప్పుడు ఏమాత్రం బాగాలేదు. పేలవమైన ప్రదర్శన ఇస్తున్నాడు. ఆయన తన చివరి ఇంటర్నేషనల్‌ సెంచరీని 2019లో సాధించాడు. ఆ తరువాత 46 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ ఆడాడు.. ఒక్క సెంచరీ లేదు. ఆట బాగుంటే ఏం చేసినా చెల్లుతుంది… లేకపోతే ట్రోలింగ్‌ తప్పదుసుమా!!

Exit mobile version