NTV Telugu Site icon

IND Vs SA: రెండో వన్డే నుంచి రుతురాజ్, రవి బిష్ణోయ్ అవుట్..!!

Ind Vs Sa

Ind Vs Sa

IND Vs SA: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులు చేసింది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్, జిడ్డు బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనబెట్టింది. వీరి స్థానంలో ఆల్‌రౌండర్లు షాబాజ్ అహ్మద్‌, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే తొలివన్డేలో ఓటమి పాలైన టీమిండియా రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ వన్డే కూడా చేజార్చుకుంటే భారత జట్టు సిరీస్‌ను కూడా కోల్పోవాల్సి ఉంటుంది.

అటు దక్షిణాఫ్రికా కూడా మూడు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ బవుమా అనారోగ్యం కారణంగా తప్పుకోవడంతో కేశవ్ మహారాజ్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. బవుమా, షాంసీ, ఎంగిడి స్థానాల్లో రెజా హెండ్రిక్స్, ఫోర్చ్యూన్, నోర్జ్ తుది జట్టులో స్థానం సంపాదించారు.

తుది జట్ల వివరాలు:
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, శార్దుల్ ఠాకూర్, సుందర్, షాబాద్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, సిరాజ్.
దక్షిణాఫ్రికా: కేశవ్ మహారాజ్ (కెప్టెన్), జానేమన్ మలన్, డికాక్, హెండ్రిక్స్, మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, పార్నెల్, ఫోర్చ్యూన్, రబాడ, నోర్జే.