Site icon NTV Telugu

IND Vs SA: చేతులేత్తెసిన టాపార్డర్.. ఇండోర్ టీ20లో భారత్ పరాజయం

Indore T20

Indore T20

IND Vs SA: ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. 228 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులో ఎంపికైన శ్రేయస్ అయ్యర్ కూడా ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. అయితే బర్త్ డే బాయ్ రిషబ్ పంత్ 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 21 బంతుల్లో 46 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్ హీరో సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరగా అవుటయ్యాడు. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్ కూడా రాణించలేదు. దీపక్ చాహర్ (31), ఉమేష్ యాదవ్ (20) కాసేపు నిలబడి ఆశలు రేకెత్తించారు. కానీ అప్పటికే రన్‌రేట్ పెరిగిపోవడంతో భారత్ పరాజయం ఖరారైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

Read Also: Capcicum: క్యాప్సికంతో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు

Exit mobile version